EPAPER

TGPSC Group 1 Mains: ఎగ్జామ్ హాల్ లోపలికి పంపలేదని.. గోడ దూకిన గ్రూపు 1 అభ్యర్ధి.. చివరికి ఏం అయిందంటే..

TGPSC Group 1 Mains: ఎగ్జామ్ హాల్ లోపలికి పంపలేదని.. గోడ దూకిన గ్రూపు 1 అభ్యర్ధి.. చివరికి ఏం అయిందంటే..

TGPSC Group 1 Mains: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో 46 కేంద్రాల వద్ద పరీక్ష ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలు కాగా.. 1:30 వరకే అభ్యర్థులను కేంద్రాలలోనికి అనుమతించారు. ఈ రోజు నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 పోస్టులకు 31 వేల 382 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


గ్రూప్‌ 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా కలక్టర్‌ శశాంక్‌. పోలీసుల బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 46 పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు అవకాశాలున్నాయన్నారు. పరీక్ష గది, చీఫ్‌ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ప్రశ్నాపత్రాలు, జీపీఎస్‌ వాహనాల్లో జవాబు పత్రాలు తరలిస్తామన్నారు.

గ్రూప్‌ 1 పరీక్షలు పరీక్షలు జరుగుతున్న తరుణంలో కింద్రాబాద్ పీజీ కాలేజ్ సెంటర్‌కు ఓ అభ్యర్థి ఆలస్యంగా వెళ్లారు. టైం దాటిన వెంటనే అధికారులు కాలేజ్ ఎంట్రన్స్ గేటుకు తాళాలు వేశారు. ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థి.. పోలీసులను ఎంత రిక్వెస్ట్ చేసినా అనుమతించలేదు. దీంతో.. ఆ యువకుడు గోడ దూకి లోపలికి వెళ్లాడు. అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు.


Also Read: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు ఆలస్యంగా హాజరైన అభ్యర్థులను అధికారులు లోపలకి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులు కన్నీటితో వెనుదిరిగారు. బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సెంటర్‌కు లతమ్మ అనే అభ్యర్థి ఒకేఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లారు. దీంతో లేట్ అయిందని పోలీసులు లోపలకి అనుమతించలేదు. ఆమె పరీక్షా కేంద్రానికి తన భర్త కుమారుడితో కలసి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వెళ్లింది. పోలీసులను ఎంత రిక్వెస్ట్ చేసినా అనుమతించలేదు. దీంతో ఆమె సృహ తప్పి పడిపోయింది.

ఓ అభ్యర్థి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెంటర్‌కు బదులు మరో సెంటర్‌కు వెళ్లారు. ‌MLRIT కళాశాల, ఎరోనాటికల్ ఎన్‌క్లేవ్ సెంటర్లు పక్కపక్కనే ఉండటంతో ఓ అభ్యర్థి పొరపడ్డారు. రెండు ఒకే ఏరియాలో ఉంటడం వలన అడ్రస్ ఒకటే ఇచ్చారు. దీంతో.. ఈ పొరపాటు జరిగింది. ఎరోనాటికల్ ఎన్‌క్లేవ్ కు బదులు ఆ అభ్యర్థి ‌MLRIT కాలేజీకి వెళ్లారు. అయితే.. మేడ్చల్ ఏసీపీ ఆదేశాలతో స్థానిక పోలీసు సిబ్బంది ఆ అభ్యర్థిని ఎరోనాటికల్ ఎన్‌క్లేవ్ తీసుకెళ్లి హెల్ప్ చేశారు.

మరోవైపు కీసర గీతాంజలి కళాశాల సెంటర్‌కు వెళ్లాల్సిన అభ్యర్థులకు పోలీసుల ముందస్తు చర్యలు ఉపయోగపడ్డాయి. ఆలస్యం అయ్యే అభ్యర్థులకు ముందస్తుగా ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. చాలా మందికి చివరి నిమిషంలో పోలీస్ పెట్రోల్ వాహనం ఉపయోగపడింది. సరైన సమయానికి వాహనాన్ని గేటు ముందు నిలిపడంతో ఓ అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకి వెళ్లారు.

 

Related News

Mallanna Sagar Land: రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు.. హరీష్ రావుకు వార్నింగ్

Chit Fund: చీటింగ్.. చిట్ ఫండ్స్

Bhatti Vikramarka: పవర్ కట్ సమస్యలకు క్షణాల్లో పరిష్కారం.. విద్యుత్ అంబులెన్స్‌‌లు ఇలా పనిచేస్తాయ్!

Group 1 Mains: గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం.. అన్ని కేంద్రాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్

MLA Kadiyam Srihari : అలా చెప్పినందుకే.. నన్ను పక్కన పెట్టేశారు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Brs Working President KTR : విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్

Big Stories

×