కీళ్లనొప్పుల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ మహిళలు, పురుషులు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు.

మహిళలు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనక ఇది వారి రోజువారీ పనులపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.

కీళ్లనొప్పులు ఉన్న వారు రెగ్యులర్ ఫిజియోథెరపీ, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

నారింజ,కివి,బెర్రీలు, ఆకుపచ్చ ఆకు కూరలలో పుష్కలంగా ఉంటాయి. తరుచుగా ఇవి తినడం వల్ల కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.

ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తినాలి.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఫైబర్స్ యొక్క మంచి వనరులు. వీటిని తినడం వల్ల కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

కర్కుమిన్ అనే మూలకం పసుపులో ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

 ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇదే కాకుండా,పరిమిత పరిమాణంలో మాత్రమే చక్కెరను తినండి.