EPAPER

Cyclone Dana: ఏపీకి తప్పిన గండం.. ఒడిశాకు తుఫాన్ ముప్పు, ఇంతకీ ‘దానా’ సైక్లోన్‌కు అర్థం ఏమిటీ?

Cyclone Dana: ఏపీకి తప్పిన గండం.. ఒడిశాకు తుఫాన్ ముప్పు, ఇంతకీ ‘దానా’ సైక్లోన్‌కు అర్థం ఏమిటీ?

Cyclone Dana: తూర్పు తీర రాష్ట్రాలకు దానా తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, నేడు మంగళవారం ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇది పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరం వైపు కదులుతోందన్నారు. కాగా ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుఫాను ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీలలో కొస్తాంద్ర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.


ఐఎండీ ప్రకారం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై దానా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్​ 23న ఒడిశా తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానా తుఫాను తీరం దాటిన తర్వాత.. అక్టోబర్ 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం పూరీ, ఖుర్దు, గంజన్​, జగత్​సింగ్​ఫూర్​ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

దానా తుపాను నేపథ్యంలో అటు పశ్చిమ్​ బెంగాల్​లోని తీర ప్రాంతాల్లో ఈ నెల 23న తేలికపాటి వర్షాలు పడతాయి. 24 వ తేదీనా పశ్చిమ బెంగాల్‌లోని గంగానది తీర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. హౌరా, తూర్పు- పశ్చిమ మేదినిపొర, నార్త్​- సౌత్​ 24 పరగణాస్​లో బుధ, గురువారాలు భారీ నుంచి అతి భారీ వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దానా తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ్వొచ్చని, గురు, శుక్రవారాల్లో తీర ప్రాంతాల్లో 20సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవ్వొచ్చు. కొన్ని చోట్ల గరిష్ఠంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రికార్డ్​ అయ్యే అవకాశం ఉంది.


Also Read:  విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

ఏపీకి తుఫాను ముప్పు తక్కువే..

ఏపీలో కూడా వర్షాలు పడతాయని, కానీ దానా తుఫాను ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావం అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించంది. దానా తుఫాను కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేశారు.

తుఫానుకు “దానా” అనే పేరు వచ్చిందంటే..

అసలు తుఫాన్లకు పేరు ఎలా వస్తుందని అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాతావరణం గురించిన సమాచారంపై వాతావరణ కేంద్రాలు వెల్లడించే సమాచారం ఎలాంటి అయోమయం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుఫాన్లకు పేర్లు పెడతారు. ఒకే ప్రాతంలో ఒకేసారి ఒకటికన్న ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాలను గుర్తించేందుకు పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయా ఆసియాలో దేశాలో తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా ఒడిస్సాను వణికిస్తున్న తుఫాను ‘దానా ‘అనే పేరు పెట్టింది సౌదీ అరేబియా.. ‘దానా’ అంటే అరబిక్‌లో “దాతృత్వం” అని అర్థం

 

 

Related News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Borugadda: పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ!

AP Speaker Ayyanna Patrudu: నమస్కారం పెట్టాల్సిందే..

Sharmila on YS Jagan: మోడీ వారసుడిగా జగన్.. అవి ఎప్పుడో మర్చిపోయాడు.. వైయస్ షర్మిళ

Super Six in AP: సూపర్ సిక్స్ ఆలస్యం అందుకేనా.. నాలుగు నెలలవుతున్నా ఏదీ ముందడుగు?

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Diarrhea In Gurla: పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

Big Stories

×