EPAPER

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Pocso Case On Ekta Kapoor: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌  మెడకు పోక్సో కేసు ఉచ్చు చిక్కుకుంది. ఆల్ట్‌ బాలాజీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న‘గంధీ బాత్‌’ వెబ్‌ సిరీస్‌ లో అమ్మాయిలను అసభ్యంగా చూపించారనే ఫిర్యాదుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ గతంలో ‘గంధీ బాత్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 సీజన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్ట్‌ బాలాజీ ఓటీటీ వేదిగా స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఎంహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ లో ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ మీద ఫిర్యాదు చేశాడు. ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ లోని 6వ సీజన్ లో బాలికలను అశ్లీలంగా చూపించాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాజంలో గొప్ప వ్యక్తులగా పేరు తెచ్చుకున్న వారితో పాటు సాధువులను అవమానించేలా ఈ సిరీస్ లో సన్నివేశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ తో సాధువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పోక్సో చట్టానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించేలా ఈ సిరీస్ ను రూపొందించాని వెల్లడించారు. వెంటనే చిత్ర నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ పై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


మూడేళ్ల క్రితం ప్రసారమైన సిరీస్ పై ఇప్పుడు కేసు

వాస్తవానికి ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ మూడు సంవత్సరాల క్రితం ప్రసారం అయ్యింది. 2021 ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య ఆల్ట్‌ బాలాజీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో మైనర్‌ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించే సన్నివేశాలు ఉన్నాయంటూ అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వెబ్ సిరీస్ పై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో 6వ సీజన్ లోని వివాదాస్పద ఎపిసోడ్ ను ఓటీటీ నుంచి డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాకపోయినా, చట్టపరంగా తప్పుడు చర్య కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు మూడేళ్ల కిందట రిలీజ్ అయిన ఈ సిరీస్ పై ఇప్పుడు కేసు పెట్టడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పోక్సో చట్టం ఏం చెప్తోంది?

బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ లో కీలక తీర్పు వెల్లడించింది. చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసినా నేరమేనని వెల్లడించింది. మరోవైపు 12 సంవత్సరాల లోపు వయసున్న బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ దోషులకు కఠిన శిక్షలు అమలు చేసేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో యాక్ట్ ను తీసుకొచ్చింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం కేసు నమోదు కావడంతో ఏక్తా కపూర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.

Read Also: రూ. 250 కోట్లతో ఇల్లు కడుతున్న ఆలియా, మరీ అంత చెత్తగా ఉందేంటని ట్రోల్స్!

Related News

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

Pottel Controversy : క్యాస్టింగ్ కౌచ్ పై అనన్యకు ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ కంప్లయింట్

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Big Stories

×