EPAPER
Kirrak Couples Episode 1

Tollywood Fight Masters Ram Laxman : హీరోల బాడీ లాంగ్వేజ్‌, మూవీ క్యారెక్టరైజేష‌న్‌కు త‌గ్గ‌ట్లే ఫైట్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌

Tollywood Fight Masters Ram Laxman : హీరోల బాడీ లాంగ్వేజ్‌, మూవీ క్యారెక్టరైజేష‌న్‌కు త‌గ్గ‌ట్లే ఫైట్స్  రామ్ ల‌క్ష్మ‌ణ్‌

Tollywood Fight Masters Ram Laxman : మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్యస‌.. నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్నాయి. ఇందులో ముందుగా వీర సింహా రెడ్డి జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. జ‌న‌వ‌రి 13న వాల్తేరు వీర‌య్య రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల‌కు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. వారు ఈ రెండు సినిమాల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు..


‘‘ఫైట్‌కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్‌కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చుని వుంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు గారు చెయిర్‌లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్‌ని కంపోజ్ చేశాం. చెయిర్‌లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య క్యారెక్టరైజేషన్‌లో ఉన్న మ్యాజిక్.

వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవిగారు.. ఇంటర్వెల్‌లో సడన్‌గా రెండు గన్స్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవిగారు, శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారి ‘వాల్తేరు వీరయ్య‘, బాలకృష్ణ గారి ‘వీరసింహారెడ్డి’ రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్‌గా ఉండటం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది.


బాలకృష్ణగారి వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో అన్నయ్య, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా వుంటుంది. అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది.

Tags

Related News

Zeenat Aman: అనసూయ విన్నావా.. ఆంటీ అంటే బూతు కాదంట, సీనియర్ నటి కామెంట్స్

Suchithra: ఆ లెజెండరీ డైరెక్టర్ పెద్ద కామ పిశాచి.. చచ్చే వరకు ఎవరిని వదలలేదు

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Big Stories

×