EPAPER

Malla Reddy Dance Video: డీజే టిల్లు పాటకు అదిరే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

Malla Reddy Dance Video: డీజే టిల్లు పాటకు అదిరే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

Malla Reddy Dance Video: ఆ నేతకు ఫాలోయింగ్ ఎక్కువ. అది కూడా యూత్ లో ఆయన క్రేజ్ వేరు. అంతేకదా మూగబోయిన సభలో కూడా చిరునవ్వులు చిందింపజేసే సత్తా ఆ నేత సొంతం. అందుకే ఆ నేత ఎక్కడికి వెళ్ళినా.. సందడే సందడి. ఉన్నది ఉన్నట్లు బల్ల కొట్టినట్లు చెప్పడంలో ఈయనకు లేరు సాటి అంటుంటారు ఆయన అభిమానులు. అయితే తాజాగా తన మనవరాలి పెళ్లి సంధర్భంగా ఆయన చేసిన డీజే టిల్లు డ్యాన్స్ వైరల్ గా మారింది. కానీ ఈ డ్యాన్స్ వెనుక ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదట. ఆయనెవరో కాదు మేడ్చల్ ఎమ్మేల్యే మల్లారెడ్డి.


సుధీర్ఘ రాజకీయ చరిత్ర మేడ్చల్ ఎమ్మేల్యే మల్లారెడ్డి సొంతం. తన రాజకీయ ప్రస్థానాన్ని 2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరి మల్లారెడ్డి ప్రారంభించారు. మల్లారెడ్డి అలా పార్టీలోకి వచ్చారో లేదో.. అప్పుడే మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికలలో విజయాన్ని అందుకొని, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు కూడా అప్పుడు ఈయనే కావడం విశేషం.

ఇక ఆ తరువాత తెలంగాణ నినాదం మారుమ్రోగుతున్న వేళ.. 2016 లో టీఆర్ఎస్ పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2018లో జరగగా.. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉండే ఛాన్స్ ఈయనకు దక్కింది. ఆ సమయంలో ఈయన రూటే సపరేట్. ఈయన ఏ కామెంట్ చేసినా.. అది వైరల్. డ్యాన్స్ చేసినా కూడా అంతే. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం చేజిక్కుంచుకోగా.. మేడ్చల్ నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మల్లారెడ్డి విజయాన్ని అందుకున్నారు.


మల్లారెడ్డి మైక్ అందుకుంటే చాలు.. చిరంజీవి కంటే క్రేజ్ నాకే ఉందని అంటుంటారు. అంతేకాదు తాను డ్యాన్స్ వేస్తే చాలు, వైరల్ కావాల్సిందే అంటుంటారు మల్లారెడ్డి. అయితే తన మనవరాలి పెళ్లికి అందరినీ ఆహ్వానించారు మల్లారెడ్డి. ఆ పార్టీ, ఈ పార్టీ లేదు అందరినీ ఆహ్వానించారు. మనవరాలి సంగీత్ ఫంక్షన్ తాజాగా జరిగింది. ఈ ఫంక్షన్ లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Also Read: Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

అది కూడా డీజే టిల్లు పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. కొరియోగ్రాఫర్స్ తో శిక్షణ తీసుకొని ఫంక్షన్ లో అదిరిపోయే డ్యాన్స్ చేయాలని, సుమారు వారం పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారట. అయితే ఆ కొరియోగ్రాఫర్ పేరు మాత్రం తెలియరాలేదు. 71 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ల వయస్సు కుర్రాడిలా మల్లారెడ్డి డ్యాన్స్ చేయగా.. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండీగా మారింది. మల్లారెడ్డా మజాకా.. ఒక్క స్టెప్ తో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నారు మరి. మీరు కూడా ఆయన డ్యాన్స్ చూస్తే కెవ్వు కేక అనేస్తారు. ఓసారి అలా లుక్కేయండి మరి.

Related News

Mallanna Sagar Land: రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు.. హరీష్ రావుకు వార్నింగ్

Chit Fund: చీటింగ్.. చిట్ ఫండ్స్

Bhatti Vikramarka: పవర్ కట్ సమస్యలకు క్షణాల్లో పరిష్కారం.. విద్యుత్ అంబులెన్స్‌‌లు ఇలా పనిచేస్తాయ్!

Group 1 Mains: గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం.. అన్ని కేంద్రాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్

TGPSC Group 1 Mains: ఎగ్జామ్ హాల్ లోపలికి పంపలేదని.. గోడ దూకిన గ్రూపు 1 అభ్యర్ధి.. చివరికి ఏం అయిందంటే..

MLA Kadiyam Srihari : అలా చెప్పినందుకే.. నన్ను పక్కన పెట్టేశారు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Brs Working President KTR : విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్

Big Stories

×