EPAPER

Deputy CM Pawan Kalyan: ప్లీజ్ ఆ ఒక్క పని చేయవద్దు.. వైసీపీ వల్లే రోగాలు వస్తున్నాయ్.. డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan Kalyan: ప్లీజ్ ఆ ఒక్క పని చేయవద్దు.. వైసీపీ వల్లే రోగాలు వస్తున్నాయ్.. డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan Kalyan: ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య సూచన చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఆ ఒక్క పని చేయవద్దంటూ పవన్ కోరారు. భావితరాల కోసం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు కూడా కట్టుబడి ఉండాలని పవన్ అన్నారు.


విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ.. అతిసార ప్రభావంపై, స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్రం బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు విస్తృత ప్రచారం చేసిందన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల మార్పు రాలేదన్నారు. దీని ఫలితం స్థానిక నీటి పరివాక్మక ప్రాంతాలు కలుషితం అయిపోయి, ఆ నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నారన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ప్రజలపై ఉందని, అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆధికారులను పవన్ ఆదేశించారు.

బహిరంగ మలవిసర్జన కారణంగా నీటిని కలుషితం చేస్తున్నారని, దీని వలన మీ ప్రాణాలే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రమాదంలోకి నెడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ భాద్యతగా అవగాహన కల్పించాలని, అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు ఆ భాధ్యత తీసుకోవాలన్నారు.


కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలో మరో దాదాపు రూ.650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నట్లు శుభవార్త చెప్పారు పవన్. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామన్నారు.

Also Read: Gorantla Madhav: లోఫర్ సిక్స్.. జోకర్ సిక్స్ అంటూ రెచ్చిపోయి.. సూపర్ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ గోరంట్ల

మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు, కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. గత పాలకులు వీటిపై దృష్టి సారించి ఉంటే, నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేదన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసైనా కూడా పనిచేయవచ్చు. కానీ అధికారులు గతంలో నిధులు రాలేదంటున్నారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా తాను లక్ష రూపాయలు అందించనున్నట్లు, ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామని పవన్ అన్నారు.

Related News

Super Six in AP: సూపర్ సిక్స్ ఆలస్యం అందుకేనా.. నాలుగు నెలలవుతున్నా ఏదీ ముందడుగు?

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Diarrhea In Gurla: పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

Summons to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాకింగ్.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఆ తేదీన హాజరు కావాలన్న కోర్టు

HC ON SAJJALA : సజ్జల పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం, కేసు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ

Cyclone Dana: ఏపీకి తప్పిన గండం.. ఒడిశాకు తుఫాన్ ముప్పు, ఇంతకీ ‘దానా’ సైక్లోన్‌కు అర్థం ఏమిటీ?

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Big Stories

×