EPAPER

SRT Entertainments : నిర్మాణ సంస్థకు బ్యాడ్ టైం… ఈ బ్యానర్లో సినిమా చేస్తే హీరోల కెరీర్ ఢమాల్

SRT Entertainments : నిర్మాణ సంస్థకు బ్యాడ్ టైం… ఈ బ్యానర్లో సినిమా చేస్తే హీరోల కెరీర్ ఢమాల్

SRT Entertainments : సినిమా ఇండస్ట్రీలో లక్ అనే సెంటిమెంట్ కేవలం హీరో హీరోయిన్లకు మాత్రమే కాదు అందులో పని చేసే టెక్నీషియన్లకు, ముఖ్యంగా నిర్మాతలకు కూడా వర్తిస్తుంది. కొంతమంది నిర్మాతలు జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తూ చాలామంది హీరోలకు, హీరోయిన్లకు కెరీర్ ను ఇస్తారు. మరి కొంతమంది నిర్మాతలకు లేదా నిర్మాణ సంస్థలకు మాత్రం వరుసగా డిజాస్టర్లు ఎదురై, హీరోల కెరీర్ కు కొత్త ఇబ్బందులను తెచ్చి పెడతాయి. తాజాగా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ (SRT Entertainments) అనే బ్యానర్ కి ఇండస్ట్రీలో బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటిదాకా ఈ బ్యానర్లో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దీంతో ఈ బ్యానర్ లో సినిమాలు చేసే హీరోల కెరీర్ ఢమాల్ అంటున్నారు.


ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ తీసిన సినిమాలు…

2016లో ‘చుట్టాలబ్బాయి’, 2018లో ‘దండుపాళ్యం 3’ అనే కన్నడ మూవీ, ‘నేల టికెట్’, 2020లో ‘డిస్కో రాజా’, 2022లో ‘కిన్నెరసాని’, 2023 లో ‘వసంత కోకిల’ అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ ను ఈ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇందులో ఎక్కువగా రవితేజ నటించిన సినిమాలే ఉండడం విశేషం.


బ్యానర్ కు బ్యాడ్ టైం

ఇక ఈ లిస్టులో చూసుకుంటే ఒక్క సినిమా కూడా హిట్ అన్న మాటే లేదు. ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. కనీసం ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా జనాలకు తెలియదు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది రవితేజ (Raviteja) గురించి. ఈ బ్యానర్లో ఆయన నేల టికెట్, డిస్కో రాజా అనే రెండు సినిమాలు చేశారు. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటమే కాకుండా, ప్రస్తుతం రవితేజ కెరీర్ ఎలాంటి సిచువేషన్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ అనే సినిమాను తీశారు. కానీ అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక బాబీ సింహా హీరోగా నటించిన ‘వసంత కోకిల’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమా పర్వాలేదు అన్న రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఇదంతా చూస్తుంటే నిర్మాణ సంస్థ అంటే కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీయడమే కాదు, ట్రెండ్ కు తగ్గ కథలను ఎంచుకోవడం, జనాలను అట్రాక్ట్ చేయదగ్గ పర్ఫెక్ట్ ప్రమోషన్స్ స్ట్రాటజీ ఉపయోగించడం, కనీసం పెట్టిన పెట్టుబడిని వెనక్కి రప్పించగలిగే కంటెంట్ తో జనాలను ఎంటర్టైన్ చేయడం, ట్రెండ్ ఫాలో అవ్వడం అనే అంశాలలో ఈ బ్యానర్ బాగా వెనకబడిపోవడం వల్లే ఇలా వరుస నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

విశ్వక్ సేన్ పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా, రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ (SRT Entertainments) పై ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాని చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా విశ్వక్ కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడేమో బ్యాడ్ టైమ్ నడుస్తున్న ఈ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. మరి ఈ హీరో అయినా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ కి గుడ్ టైం తెచ్చి పెడతాడా? అనేది చూడాలి.

Related News

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

The Raja Saab: ‘రాజా సాబ్’ పోస్టర్ రిలీజ్.. అరే ఏంట్రా ఇది?

NBK 109: ముందుకా వెనక్కా.. కన్ఫ్యూజన్‌లో బాలయ్య

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Vinnaithaandi Varuvaayaa: రీ రిలీజ్‌లో ఇదొక రికార్డ్.. రెండున్నర సంవత్సరాలుగా అదే సినిమా స్క్రీనింగ్

Big Stories

×