EPAPER

Yahya Sinwar Tunnel: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్

Yahya Sinwar Tunnel: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్

Yahya Sinwar Tunnel| ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్ల మరణించిన హమాస్ అధ్యక్షుడు యహ్యా సిన్వర్ పైకి ప్రజా పోరాటం పేరుతో ఉద్రేకంగా ప్రసంగాలు చేసినా.. లోపల మాత్రం విలాసంగా జీవించేవాడని ఇజ్రాయెల్ సైన్యం ఆధారాలు చూపిస్తూ వీడియో విడుదల చేసింది.


2023లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై ఒక్కసారిగా చేసిన దాడుల్ల దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఆ వెంటనే 250 మంది పౌరులను హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి బందీలుగా తీసుకెళ్లారు. ఈ దాడులు, కిడ్నాప్ వెనుక మాస్టర్ మైండ్ అయిన యహ్యా సిన్వర్ దాడి చేసిన వెంటనే ఇంటి నుంచి పారిపోయాడని.. వార్తలు వచ్చాయి.

ఈ ఘటన కారణంగా ఏడాది కాలంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తోంది. హమాస్ మిలిటెంట్ల వేట ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాలోని అమాయక పౌరుల ప్రాణాలను లెక్కచేయలేదు. ఇప్పటివరకు దాదాపు 42000 మంది పౌరులు చనిపోయారు. వీరిలో మహిళలు, చిన్నపిల్లలే 22000 మందికి పైగా ఉన్నారని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.


Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

ఒకవైపు గాజాలో వేలమంది అమాయకులు చనిపోతుంటే వారి నాయకుడు యహ్యా సిన్వర్ మాత్రం ఇజ్రాయెల్ చేతికి చిక్కకుండా రహస్యంగా విలాసాలు చేసేవాడని ఇప్పుడు వీడియోలు విడుదలయ్యాయి. ఈ వీడియోల్లో యహ్యా సిన్వర్, తన భార్య పిల్లలతో ఒక టన్నెల్ మార్గంలో బయలుదేరి అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో అతని భార్య చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది. హర్మిస్ బిర్కిన్ బ్రాండ్ కు చెందిన ఈ హ్యాండ్ బ్యాంగ్ విలువ దాదాపు రూ.27లక్షలు. ఆ బ్యాగ్ పై ఉన్న లోగో, డిజైన్ చూస్తే.. అది హర్మిస్ బిర్కిన్ కంపెనీ బ్రాండ్ కు చెందిన బిర్కిన్ 40 బ్లాక్ టోగో గోల్డ్ హార్డ్ వేర్ ఎడిషన్ గా గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్ ప్రతినిధి డానియెల్ హాగెర తెలిపారు. వీడియోలో అతని పిల్లలు, భార్య టన్నెల్ లోపల పరుపు, దిండు లాంటివి తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

ఆ అండర్ గ్రౌండ్ ప్రాంతంలో యహ్యా సిన్వర్ అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే బాత్ రూమ్, వంట గది, తినడానికి ఆహార పదార్థాలు, కావాల్సినంత నగదు ఉన్నాయి. వీటితో పాటు భూమిలోపల రమస్య గదిలో ఒక టీవి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇదంతా ఎక్కడో లేదు. అతడి ఇంటి కిందనే ఉంది. అక్టోబర్ 7, 2023 దాడులు చేసిన వెంటనే సిన్వర్ గాజాలోని తన ఇంటి కింద ఇలా అండర్ గ్రౌండ్ స్థావరంలో వెళ్లిపోయి దాక్కున్నాడు.

మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం అతడి కోసం ఎక్కడ దాక్కున్నాడని వెతుకుతూ ఇళ్లు, ఆస్పత్రులు అని తేడా లేకుండా అనుమానం ఉన్న ప్రతి చోట బాంబులు కురిపించింది. ఆ బాంబుల ధాటికి అమాయక గాజా వాసులు తమ పిల్లలను, కుటుంబాలను కోల్పోయారు. అయితే గత వారం గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల్లో యహ్యా సిన్వర్ చనిపోయాడు. యహ్యా సిన్వర్ మృతితో దాదాపు ఇజ్రాయెల్ టార్గెట్ పూర్తి అయినట్లే.. అందుకే ఇక యుద్దం ముగించాలని అన్ని దేశాలు ఇజ్రాయెల్ ను కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. మాత్రం హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విడిపించేంతవరకు యుద్ధం ఆపేది లేదని చెప్పారు.

Related News

Australia King Charles: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

British Columbia Elections: బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో భారతీయుల హవా.. ఏకంగా 14 మంది విజయం!

Trump Mc Donalds: మెక్ డొనాల్డ్స్‌లో వంట చేసిన ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ‘ఇండియన్’ ఫార్ములా?

ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Big Stories

×