EPAPER

Joint Pain Diet: కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఖచ్చితంగా ఇవి తినాల్సిందే !

Joint Pain Diet: కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఖచ్చితంగా ఇవి తినాల్సిందే !

Joint Pain Diet: కీళ్లనొప్పుల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ మహిళలు, పురుషులు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. మహిళలు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనక ఇది వారి రోజువారీ పనులపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.


కీళ్లనొప్పులు ఉన్న వారు రెగ్యులర్ ఫిజియోథెరపీ, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. సమతుల్య ఆహారం, ఆర్థరైటిస్ పై ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, అది మీ కీళ్లను బలంగా ఉంచుతుంది. అంతే కాకుండా కొంత మందిలో వచ్చే కాళ్ల వాపును కూడా తగ్గిస్తుంది.

రెగ్యులర్ డైట్‌లో వీటిని చేర్చుకోండి..


ఆర్థరైటిస్ నొప్పితో ఇబ్బంది పడే వారు పోషకాహారాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కీళ్లలో వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. మీ ఆహారంలో చేపలు, అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లను చేర్చుకోవడం వల్ల కూడా శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.

విటమిన్ సి-విటమిన్ ఇ:
విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి నారింజ, కివి, బెర్రీలు, ఆకుపచ్చ ఆకు కూరలలో పుష్కలంగా ఉంటాయి. తరుచుగా ఈ ఆహారాలు తినడం వల్ల కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.

కాల్షియం-విటమిన్ డి:
ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం చాలా అవసరం. ఇదే కాకుండా, విటమిన్ డి శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. పాలు, పెరుగు, జున్ను, పచ్చి కూరగాయలు, బలవర్ధకమైన ఆహారాలు వంటి పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క మంచి వనరులు. ఉదయాన్నే ఎండలో ఉండటం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది.

ఫైబర్:
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఫైబర్స్ యొక్క మంచి వనరులు. ఇవి బరువును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల వాపు తగ్గడమే కాకుండా కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

పసుపు-అల్లం:
కర్కుమిన్ అనే మూలకం పసుపులో ఉంటుంది. ఇది సహజ శోథ నిరోధకం. అల్లం కూడా వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని టీ లేదా సలాడ్ రూపంలో మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి.

జింక్-మెగ్నీషియం:
మీ ఆహారంలో జింక్ అధికంగా ఉండే ఆహారాలను కూడా చేర్చుకోండి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది. నాన్ వెజ్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఫోర్టిఫైడ్ తృణధాన్యాలలో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇదే కాకుండా, ఆకుపచ్చ ఆకు కూరలు, తృణధాన్యాలలో లభించే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకల నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Also Read: తక్కువ టైంలో.. ఎక్కువ బరువు తగ్గించే బెస్ట్ డ్రింక్

వీటిని నివారించండి:
కీళ్ల వాపు: ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇదే కాకుండా, పరిమిత పరిమాణంలో మాత్రమే చక్కెరను తినండి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను పెంచుతాయి. అంతే కాకుండా ఇది కీళ్ల నొప్పులను కూడా పెంచుతుంది.ఇవి కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్థాలు-పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు-ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అంతే కాకుండా కీళ్లను కూడా బలోపేతం చేస్తాయి.

ఆర్థరైటిస్‌ను తగ్గించడానికి వ్యాయామం: 

ఆహారంపై శ్రద్ధ పెట్టడంతోపాటు మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా అనుసరించాలి. ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయండి.వాకింగ్‌కు కూడా వెళ్ళండి. చల్లని వాతావరణం ఉన్నప్పుడు వెచ్చని బట్టలు ధరించండి. అంతే కాకుండా వేసవిలో ఎండకు వెళ్లకుండా ఉండండి.

Related News

Dark Neck Elbows: వీటితో మెడ, మోచేతులపై ఉన్న నలుపు మాయం

Tips For Skin Whitening: మీ ఫేస్ తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Tips For Weight Loss: తక్కువ టైంలో.. ఎక్కువ బరువు తగ్గించే బెస్ట్ డ్రింక్

Aloe Vera: అలోవెరా తింటే శరీరంలో జరిగే 5 మ్యాజిక్స్ ఇవే !

Dark Elbows: మోచేతుల నలుపుదనానికి చెక్ పెట్టండిలా !

Yoga for healthy hair: జుట్టు రాలకుండా ఉండటానికి.. ఈ యోగాసనాలు చేయండి

Big Stories

×