EPAPER

Devara: ఆల్ టైం రికార్డ్.. దేవర మూవీకి ఎంత లాభం అంటే..?

Devara: ఆల్ టైం రికార్డ్.. దేవర మూవీకి ఎంత లాభం అంటే..?

Devara.. రాజమౌళి (Rajamouli) సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ ఆల్ టైం రికార్డ్ సృష్టించారు ఎన్టీఆర్ (NTR). సాధారణంగా రాజమౌళి సినిమా చేసిన తరువాత అదే హీరో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తే డిజాస్టర్ గా మారాల్సిందే అంటూ ఒక సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్ (NTR) దేవర (Devara)మూవీ తో బ్రేక్ చేశారని చెప్పవచ్చు. ఆచార్య (Acharya)సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య దేవర సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ (Koratala Shiva). ఈ సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా 24 రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ సృష్టించి, ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ కి నిదర్శనంగా నిలిచింది.


రూ.190 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి..

ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన చిత్రం దేవర యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మించిన ఈ చిత్రం నాలుగు వారాలు పూర్తి చేసుకున్న నిలకడగా వసూలు సాధిస్తూ దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇకపోతే ఈ సినిమా 24 రోజుల కలెక్షన్ల వివరాలు వైరల్ గా మారాయి. దేవర సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.185 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 190 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు మేకర్స్. అలా భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించింది.


ఆల్ టైం రికార్డ్స్ సృష్టించిన ఎన్టీఆర్ దేవర..

నాలుగు వారాలలో సాధించిన కలెక్షన్స్ వివరాలలోకి వెళ్తే, తెలుగుతోపాటు కన్నడ , హిందీ భాషల్లో భారీగా వసూలు రాబడుతూ రికార్డు సృష్టించింది. మరోవైపు తమిళ్, మలయాళం లో ఒక మోస్తారు కలెక్షన్లతో సరిపెట్టుకుంది ఈ సినిమా. మొదటి రోజే రూ.172 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన దేవర, తొలి వారంలోనే రూ.250 కోట్లు అందుకుంది. రెండవ వారంలో కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా.. మూడో వారంలో 21 కోట్ల రూపాయలతో సరిపెట్టుకుంది. అలా మూడు వారాల కలెక్షన్స్ చూసినట్లయితే ఏకంగా రూ.335 కోట్లు అందుకుంది. అత్యధికంగా ఆంధ్ర, నైజాం కలిపి ఈ సినిమా రూ.220 కోట్లు వసూలు చేయగా.. హిందీలో ఒక్కటే రూ.74 కోట్లు , కన్నడలో రూ.34 కోట్లు, తమిళంలో రూ.12 కోట్లు రాబట్టింది. ఇక మలయాళంలో కేవలం రూ .3కోట్లు మాత్రమే రాబట్టింది ఈ సినిమా.

రూ.100 కోట్ల లాభాల దిశగా..

ఓవర్సీస్ లో కూడా విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రాబట్టిన ఈ సినిమా 21 రోజుల్లో దాదాపు రూ.91 కోట్లు వసూలు చేసింది. ఇకపోతే ఇప్పటివరకు రూ.340 కోట్ల నికరంగా రూ.514 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. రూ.190 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటికే రూ .100 కోట్లకు పైగా లాభాలు రాబట్టి అటు ఎగ్జిబిటర్లకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందించింది ఈ సినిమా. మొత్తానికైతే దేవర సినిమాతో ఆల్ టైం రికార్డ్ అందుకున్నారు ఎన్టీఆర్.

Tags

Related News

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Vinnaithaandi Varuvaayaa: రీ రిలీజ్‌లో ఇదొక రికార్డ్.. రెండున్నర సంవత్సరాలుగా అదే సినిమా స్క్రీనింగ్

Vishwambhara : దొరికిపోయిన ‘విశ్వంభర’… టీజర్లోనే ఇన్ని డమ్మీలైతే సినిమా పరిస్థితి ఏంటో?

Shobhitha dulipala: సాంప్రదాయంగా పెళ్లి పనులు షురూ.. నాటి కాలాలను గుర్తుచేసిన శోభిత..!

Hit 3: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3.. కాశ్మీర్లో షూటింగ్..ఆ రోజు నుంచే..!

Netizens Trolling: రూ. 250 కోట్లతో ఇల్లు కడుతున్న ఆలియా, మరీ అంత చెత్తగా ఉందేంటని ట్రోల్స్!

Mechanic Rocky : విశ్వక్ మూవీ స్టోరీ లీక్… హిట్ అవ్వడానికి ఇది సరిపొద్దా..?

Big Stories

×