EPAPER

Niagara Falls of India: చిత్ర కూట్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. ఎలా వెళ్లాలో తెలుసా?

Niagara Falls of India: చిత్ర కూట్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. ఎలా వెళ్లాలో తెలుసా?

Niagara Falls of India: స్వర్గం అంటే ఎక్కడో ఉండదు.! మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే ఉంటుంది! మనసు కళ్లు తెరిచే చూడాలే కానీ.. మన కళ్లకు కనిపించే అందాలు.. అంతకుమించిన అద్భుతాలు చాలానే ఉంటాయి. అలాంటి  ఓ అందమైన ప్రకృతి వరాన్ని.. నేచర్ వండర్‌ని మీ కళ్ల ముందుంచబోతోంది బిగ్ టీవీ. ఈ చిత్రం చూసి.. మీ చిత్తం చెదరడమే కాదు.. ఇంచు ఇంచులో కనిపించే ఆ అందాల్ని చూసి.. చిత్తరువైపోతారు. ఇన్నాళ్లూ.. ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యామా? అని ఫీలవుతారు. అదే  జగదల్పూర్


వర్షాకాలం అయిపోయింది.. శీతాకాలం వచ్చేస్తుంది. ఇప్పుడు.. ఎక్కడ చూసినా టూరిస్టుల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లోని జలపాతాలు, అడవుల్లోని పచ్చదనం, ప్రకృతి రమణీయత.. పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అలా.. విశాఖ ఏజెన్సీకి దగ్గర్లో ఉన్న ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను చూపించేందుకు బిగ్ టీవీ సిద్ధంగా ఉంది. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్‌ని మీకు చూపించబోతున్నాం. విశాఖ నుంచి చిత్రకూట్ వరకు ఈ టూర్ ఎలా ఉంటుంది? వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా చేరుకోవాలి? ఈ మధ్యలో.. ఏయే పర్యాటక ప్రదేశాలున్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే.. విశేషాలను ఈ చిత్రకూట్ జర్నీలో చూసేద్దాం!

సాధారణ రోజుల్లో కంటే.. వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. పైనుంచి జాలువారే నీటి దృశ్యాలు.. కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయ్. దేశంలో ఎన్నో జలపాతాలు ఉన్నా.. ఇండియా నయాగరా అనే పేరున్న వాటర్ ఫాల్స్ మాత్రం చిత్రకూటే. ఇక్కడికి వెళ్లాలంటే.. విశాఖ నుంచి జగదల్పూర్‌కు నేరుగా ట్రైన్ ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి 9 గంటల 20 నిమిషాలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కిరండోల్ ఎక్స్‌ప్రైస్ బయల్దేరుతుంది. తెల్లవారుజామున 5 గంటల వరకు.. జగదల్పూర్ చేరుకోవచ్చు.


జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్.. 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కొన్ని నెలల క్రితం వరకు.. విశాఖ నుంచి జగదల్పూర్‌కి నేరుగా ఫ్లైట్స్ కూడా ఉండేవి. కానీ.. ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందని.. ప్రస్తుతం ఫ్లైట్స్ నడపడం లేదు.

జగదల్పూర్ నుంచి చిత్రకూట్ చేరుకోవడం చాలా సులువు. కన్ఫ్యూజన్ లేకుండా.. ఒకే రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరే.. ఈ రోడ్డు ఆగిపోతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో.. ఇంద్రావతి నదిపై ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇదే.. మన ఇండియా నయాగారా.. చిత్రకూట్ వాటర్ ఫాల్స్! ఎక్కడో ఉన్న నయాగారా గురించి.. ఇక్కడ గొప్పగా చెప్పుకోవడం కాదు! ఇక్కడే ప్రకృతి ప్రసాదించిన గొప్ప జలపాతాన్ని కళ్లారా వీక్షించి.. మనసారా ఆస్వాదించాలి. విశాఖ నుంచి బిగ్ టీవీ ట్రావెల్ చేసుకుంటూ.. కొత్త అనుభూతిని అందించే చిత్రకూట్ వాటర్‌ఫాల్స్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. కొండలపై నుంచి జాలువారే.. ఈ నీటి అందాలను చూసేందుకు.. రెండు కళ్లు చాలవు. వర్ణించడానికి.. అక్షరాలు సరిపోవు. చిత్రకూట్ జలపాతం అందాలు.. అంతలా పర్యాటకుల్ని కట్టిపడేస్తాయ్.

Also Read: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

వాటర్ ఫాల్స్‌ని మొదటిసారి చూడగానే.. ప్రతి ఒక్కరూ ఓ కొత్త అనుభూతిని ఫీలవుతున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. వంద అడుగుల పైనుంచి జాలువారుతున్న జలపాతాన్ని.. పాల పొంగులా పడుతున్న జలధారను చూసేందుకు.. రెండు కళ్లూ చాలవు. ఈ జలపాతం ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టే.. ఇండియన్ నయాగరాగా పేరుగాంచింది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూసేందుకు టూరిస్టులు వస్తున్నారు. బిగ్ టీవీ కూడా మన ఇండియన్ నయాగరాను ప్రకృతి ప్రేమికులకు, ప్రేక్షకులకు చూపించేందుకు.. చిత్రకూట్ దాకా వెళ్లింది. వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ నుంచి బోట్ పాయింట్ దగ్గరికి చేరుకునేందుకు.. అరకిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. టూరిస్టుల కోసం స్థానికంగా ఉండే గిరిజనులు.. అందమైన మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు.

జలపాతం అందాలు పై నుంచే కాదు.. కింద నుంచి మరింత బావుటుంది. పై నుంచి వచ్చే జలధార.. కిందకి పడుతున్నప్పుడు ఆ దృశ్యం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ సీన్‌ని.. పడవలో వెళ్లి మరింత దగ్గరగా చూసినప్పుడు.. మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. జలపాతం తుంపర్లు మనల్ని తాకినప్పుడు.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన దూరం, అలసట మొత్తం పోతాయి. అక్కడిదాకా పడిన ప్రయాసని మర్చిపోయి.. ఎంతో ఆనందంగా గడుపుతారు ఇక్కడికొచ్చే టూరిస్టులు.

పడవలో వెళ్లి జలపాతాన్ని దగ్గరగా చూసేందుకు.. ఒక్కొక్కరికి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పడవలో.. ఒక్కసారి 20 మందిని మాత్రమే తీసుకెళతారు. ప్రతి ఒక్కరూ.. లైఫ్ జాకెట్ ధరించాల్సి ఉంటుంది. అలా.. పడవలో జలపాతం దాకా వెళ్లి.. నీటి అందాలను ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడికొచ్చే టూరిస్టులు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్‌ దూరం నుంచి ఎంత బాగుంటుందో.. దగ్గరి నుంచి అంతకంటే బాగుంటుంది. దానికోసమే.. పర్యాటకులు అస్సలు ఆ అనుభూతిని మిస్సవ్వరు. ప్రతి ఒక్కరూ.. పడవలో వెళ్లి జలపాతం అందాల్ని దగ్గర్నుంచి ఆస్వాదించి వస్తుంటారు.

ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్‌ టూరిజంపై ఆధారపడి ఎన్నో గిరిజన కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. వాళ్లందరికీ.. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికొచ్చే పర్యాటకులే ప్రధాన జీవనాధారం. మీరు చూస్తున్న ఈ బొమ్మలు, ప్రత్యేక వస్తువులన్నీ.. ఇక్కడి గిరిజనులు తయారుచేసినవే. ఇంత అందమైన వస్తువులను.. అందుబాటు ధరల్లోనే టూరిస్టులకు విక్రయిస్తున్నారు. ఇక్కడికొచ్చిన టూరిస్టులు కూడా.. చిత్రకూట్ గుర్తుగా.. ఏదో ఒక వస్తువుని కొని తీసుకెళ్తుంటారు.

ఒక్కసారి సందర్శిస్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకునే అద్భుతమైన ప్రదేశం.. చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ప్రకృతి సృష్టించిన గొప్ప ఆకర్షణల్లో ఈ జలపాతం కూడా ఒకటి. భారత్‌లో ఎన్నో ఎత్తైన, ఆకర్షణీయమైన వాటర్ ఫాల్స్ ఉన్నా.. దేనికదే సాటి. వాటన్నింటిలో.. ఈ చిత్రకూట్ జలపాతానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. రంగులు మారడం.. దీనికి ఉన్న మరో ప్రత్యేకత. ఒక్కసారి.. ఈ వాటర్ ఫాల్స్‌ని చూస్తే.. జీవితకాలపు అనుభూతిని సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదీ.. ఓవరాల్‌గా నేచర్ వండర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్‌కి సంబంధించి.. బిగ్ టీవీ అందించిన స్పెషల్ రిపోర్ట్.

Related News

YS Jagan vs Kottu Satyanarayana: కొట్టు సత్యనారాయణకి.. జగన్ బిగ్ షాక్?

Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

Big Stories

×