EPAPER

GundeNinda GudiGantalu Today Episode : మీనాను గెంటేయమని చెప్పిన బాలు .. రవికోసం వెతుకుతున్న బాలు.. పుట్టింటికి చేరిన మీనా ..

GundeNinda GudiGantalu Today Episode : మీనాను గెంటేయమని చెప్పిన బాలు .. రవికోసం వెతుకుతున్న బాలు.. పుట్టింటికి చేరిన మీనా ..

Gundeninda GudiGantalu Today Episode 20th : గత ఎపిసోడ్ లో రవి శృతిలకు నిజం చెప్పి మీనా పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తుంది. మీనా ఎంత చెప్పిన బాలు న‌మ్మ‌డు. వ‌దిన ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ర‌వి కూడా బాలును క‌న్వీన్స్ చేయ‌బోతాడు. ర‌విపై ఉన్న కోపంతో త‌మ్ముడి మాట కూడా బాలు ప‌ట్టంచుకోడు. రవిని నువ్వు ప్రాణాలతో ఉండాలంటే జీవితంలో నాకు ఎప్పుడు కనిపించకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోతారు. సత్యం మీనాను తీసుకురమ్మని చెబితే బాలు పట్టించుకోడు.. అందరు ఇంటికి వెళ్ళిపోతారు. సత్యంకు హారతి ఇచ్చి లోపలి తీసుకెళ్లారు. అవమానం భరించలేను అని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ఇంటికి మీనా వస్తుంది. హే ఆగు మా కుటుంబానికి ద్రోహం చేసిన నిన్ను ఇంట్లోకి రానిస్తాన‌ని ఎలా అనుకున్నావ‌ని మీనాపై ఫైర్ అవుతుంది. నాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికే ర‌వి, శృతిల పెళ్లిని సీక్రెట్‌గా జ‌రిపించావ‌ని, నా భర్తను పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టిన దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను అని మండిపడుతుంది. మావ‌య్య స‌త్యాన్ని క‌లిసి అస‌లు జ‌రిగింది ఏమిటో, ర‌వి త‌న‌ను ఎలా మోసం చేసింది చెప్పాల‌ని మీనా ప్ర‌య‌త్నిస్తుంది. కానీ స‌త్యాన్ని మీనా క‌ల‌వ‌కుండా ప్ర‌భావ‌తి అడ్డుకుంటుంది. తిండికి గ‌తిలేని నిన్ను ఈ ఇంటి కోడ‌లిగా తీసుకొచ్చిన స‌త్యానికి గొప్ప స‌న్మానం చేశావ‌ని మీనాను ప్ర‌భావ‌తి అవ‌మానిస్తుంది, మ‌నోజ్‌, రోహిణి కూడా మీనానే త‌ప్పుప‌డ‌తారు. నీ వ‌ల్లే ఇంటి ప‌రువు బ‌జారు పాలైంద‌ని, నువ్వు ర‌వి కి పెళ్లి చేయ‌డం వ‌ల్లే స‌త్యం జైలుకు వెళ్లాడ‌ని కోప్ప‌డుతారు. మీనాను ఇంట్లోకి రానివ్వను అనేసి ప్రభావతి అంటుంది. ఇక మీనాను ఇంట్లో ఉండవను అని వార్ణింగ్ కూడా ఇస్తుంది. కానీ మీనా నన్ను పొమ్మంటే ఎక్కడికి పోవాలి .. చచ్చేవరకు ఇదే నా ఇల్లు అంటుంది.

ప్ర‌భావ‌తికి ఎదురుతిరుగుతుంది మీనా. మీరు పొమ్మంటే ఎక్క‌డికి వెళ‌తాన‌ని, ఇదే త‌న ఇళ్లు అని అంటుంది. చ‌చ్చేదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెబుతుంది. మీనాను బ‌ల‌వంతంగా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు నెట్టివేస్తుంది. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి వీలు లేదు . అస్సలు ఆ హక్కు మీకు లేదని అంటుంది. లోపలి మీనా వెళ్తుంది. నా మెడ‌లో తాళిక‌ట్టిన భ‌ర్త‌కే ఆ హ‌క్కు ఉంద‌ని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని బాలు చెబితే వెళ్లిపోతాన‌ని అంటుంది. ఇక భ‌ర్త త‌న‌ను ఉండ‌మంటాడ‌ని మీనా ఆశిస్తుంది. కానీ బాలు ఆమెకు ఊహించ‌ని షాకిస్తాడు. నిన్ను ఇంట్లోకి రావద్దు నాకు మొహం చూపించొద్దు అంటే ఎందుకొచ్చావు ..ఇక‌పై నీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని మీనాతో తెగేసి చెబుతాడు బాలు. ఇక‌పై నీకు ఈ ఇంట్లో స్థానం లేద‌ని అంటాడు. నా భార్య‌గా ఉండే అర్హ‌త‌ను నువ్వు కోల్పోయావ‌ని మీనాను కొట్టాలని అనుకుంటాడు . ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. నా కళ్ళ ముందుకు రావొద్దు అంటాడు. అందరు కలిసి దాన్ని గెంటెయ్యండి అంటారు . ఇక ప్రభావతి విన్నావుగా నీకు తాళి కట్టిన మీ ఆయనే నిన్ను గెంటేయమని అన్నాడు వేళ్ళు అని గెంటేస్తుంది.


తన భర్త మాట‌ల‌ తో మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్ల‌తో అత్తింటి నుంచి బ‌య‌ట అడుగుపెడుతుంది. మీనా వాళ్ళ అమ్మ సుమతిని కొడుతుంది ఎందుకే ఇలా చేసావు మీ అక్క కాపురాన్ని నాశనం చేసావు నీకు తెలియదా ఎలా జరుగుతుందని ఎందుకిలా చేశావు ఒక్క మాట మీ అక్క కోలా కొరకు చెప్పి ఉంటే వాళ్ళ చావు వాళ్ళు చచ్చేవాళ్ళు కదా నీకెందుకు అనవసరంగా వెళ్ళావ్ అక్క జీవితం నాశనం చేసావని నన్ను కాలేజీకి పంపించిన విరిచేసావా ఇప్పుడు అక్క జీవితాన్ని నాశనం చేసావు చూడు ఇది నీకేం అవసరం అనేసి తిడతాడు మామూలుగానే మీనాన్ని ఆ ఇంట్లో ఉండనివ్వరు మాటకి మాట ఏదో ఒకటి అంటూనే ఉంటారు మాటలతో తన హింసిస్తూనే ఉన్నారు. మనము లేని వాళ్ళమని ఉన్న కాడికి లేని కాడికి ఏదో ఒకటి తిని బతికే వాళ్ళమని తిట్టిపోస్తుంటారు ఇప్పుడు ఈ విషయం తెలిసి తన తప్పు లేదన్నా దాన్ని జీవితాంతం ఇక తిడుతూనే ఉంటారు ఇదంతా నీకు అవసరమా ఎందుకు చేసావ్ అసలు అనేసి అడుగుతుంది ఇక మీనా తన భర్త నా మాటను తలుచుకుంటూ పుట్టింటికి వస్తుంది . పుట్టింట్లో సుమతిని కొడుతుండడం చూసి అమ్మ అని ఏడుస్తుంది. మీనా ఏమైంది వచ్చేసావ్ ఏమన్నారు నిన్న అసలు అని అడుగుతుంది. నన్ను ఎవరు నమ్మట్లేదు అమ్మ నేనే ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం అని నన్ను ఇంట్లోంచి గెంటేశారమ్మ ఇక జీవితంలో నన్ను ఇంట్లోకి రానివ్వరు అంటూ తల్లితో మీనా చెప్పుకొని బాధపడుతుంది .

ఆ మాట విన్న సుమతి తన తమ్ముడు షాక్ అవుతారు. ఇదంతా నా వల్లే జరిగింది అక్క నన్ను క్షమించు ఇలా జరుగుతుందని అనుకోలేదు .రవి నేరుగా మీ ఇంటికి వస్తాడు అని అనుకున్నాను. ఇలా చేస్తారని అనుకోలేదు అక్క నన్ను క్షమించు నువ్వు కూడా నన్ను కొట్టు అక్కని సుమతి మీనా కాళ్ళ మీద పడుతుంది. ఇక మీనా తమ్ముడు ఆ సంతకం పెడితే నీ మెడకు చుట్టుకుంటుందని తెలియదు అక్క ఎందుకు తెలిసి చేశావంటే తెలుసు ఆ టైంలో ఏం చేయాలో తెలీదు అక్కడ సంతకం పెడితే చాలు అన్నారు ఈ విషయం ఎవరికీ చెప్పను అని చెప్పారు. అసలు నా పేరు బయటికి తీయని చెప్తేనే నేను ఆ సంతకం చేసానని చెప్తుంది ఇక మీనా వాళ్ళ తల్లి మీ మామ గారిని నేను ఏమని అడగను, ఆయన కాళ్లు పట్టుకోవాలన్న నా మొహం చూస్తాడా అనేసి బాధపడుతుంది . ఇక జరిగిన విషయాన్ని రవి తలుచుకుంటూ బాధపడతాడు. బాలు తనపై చేయి చేసుకోవడం తన తండ్రి తనని తోసేయడం చూసి రవి ఫీలవుతూ ఉంటాడు. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది ఏమైంది శ్రీవారు ఇంత తొందరగా లేచారు అనేసి శృతి అడుగుతుంది. నాకు అసలు నిద్ర పట్టలేదు ఎలా పడుతుందనుకున్నావు ఇంట్లో వాళ్ళు అలా ఉంటే అనేసి రవి శృతి తో అంటాడు. దానికి శృతి ఇంకా దాని గురించి మాట్లాడుతున్నావా మీ నాన్నని రిలీజ్ చేశారు మా నాన్న మనకి ఫ్రీడమ్ ఇచ్చేశారు ఇక మన లైఫ్ మనది మన చేతుల్లో మన చేతుల్లోనే మన లైఫ్ ఉంది అని అంటుంది. నాకు అసలు తల భారంగా ఉంది శృతి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళతో ఇలా అవుతుందని నేను అసలు ఆలోచించలేదు అనేసి అంటాడు . దానికి శృతి నీ తలనొప్పి పోవడానికి నేను ఒక పని చేస్తాను నువ్వు వెళ్లి అర్జెంట్గా పూలు స్వీట్స్ పళ్ళు తీసుకురా అనేసి అంటుంది . ఇవన్నీ ఎందుకు ఫ్రూట్ సలాడ్జ్ ఏమైనా పెడుతున్నావంటే అవును సమ్మర్ కదా ఫ్రూట్స్ అలా అమ్ముకుందామని చెప్పేసి అంటుంది. శృతి మన శోభనానికి ముహూర్తం పెడుతున్నాను . ఈరోజు మన శోభనం నేను రూమ్ ని డెకరేట్ చేస్తాను. నువ్వు వెళ్లి పూలు పనులు స్వీట్స్ తీసుకురాని రవికి చెప్తుంది .దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో బాలుతో కొందరు గొడవపడతారు. మీ నాన్న చాలా మంచోడు రా మీ నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు అనేసి బాలుని ఒక అతను అడుగుతారు. ఇంకొక అతను మీ నాన్న ఏమైనా మంచివాడ ఎందుకు పోలీసుల అరెస్ట్ చేశారు అనేసి అడగగానే బాలు కోపంతో అతనితో గొడవకు దిగుతాడు. ఇక మీనా వాళ్ళ అమ్మ మీనా ను ఇంట్లోంచి వెళ్ళమని చెప్తుంది అత్తింట్లో వాళ్ళు గెంటేస్తే ఇక్కడికి వచ్చాను అమ్మ ఇక్కడ నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలని నేను అడుగుతుంది. పెళ్లైన కూతురు ఇంటికి వస్తే నలుగురు నానా మాటలు నన్ను అంటారు. నువ్వు ఇక నుంచి వెళ్ళిపో బయలుదేరు అనేసి మీనాకి చెప్తుంది. మీనా ఎక్కడికి వెళ్తుంది మీ నాన్న బాలు క్షమిస్తాడా సత్యం ఇంట్లోకి రాణిస్తాడు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని మరోసారి అడ్డంగా బుక్ చేసిన పల్లవి.. ఇంటికి తాగొచ్చిన భర్తను చూసి అవని షాక్ ..

Trinayani Serial Today October 21st: ‘త్రినయని’ సీరియల్‌: నయనికి విషం ఇచ్చిన హాసిని – నిజం బయటపెట్టిన విశాలాక్షి

Satyabhama Today Episode : పచ్చబొట్టుతో సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య.. క్రిష్ చెప్పిన మాటకు ఫ్యూజులు అవుట్..

Brahmamudi Serial Today October 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కళ్యాణ్‌ కు సినిమా ఛాన్స్‌ – అనామికకు అపర్ణ వార్నింగ్‌   

Nindu Noorella Saavasam Serial Today October 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆరు ఫోటో చూపించమని మనును అడిగిన మిస్సమ్మ – మనును అమర్‌కు పెళ్లాన్ని చేస్తానన్న ఘోర

Lakshmi V’s Anu: లక్ష్మీ వర్సెస్ అనూ.. దీపావళి పటాస్ లా పేలేదెవరు..?

Big Stories

×