EPAPER

Mechanic Rocky: ఇన్ని రోజులు బజ్ రాలేదు కాదు, నేనే బజ్ ఇయ్యలే

Mechanic Rocky: ఇన్ని రోజులు బజ్ రాలేదు కాదు, నేనే బజ్ ఇయ్యలే

Mechanic Rocky: వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్సేన్(Vishwaksen). వెళ్ళిపోమాకే సినిమా అప్పుడు విశ్వక్సేన్ అసలైన పేరు దినేష్ నాయుడు. ఆ తర్వాత అది కాస్త కొన్ని రీజన్స్ వలన విశ్వక్సేన్ గా మార్చుకోవాల్సి వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అనే సినిమాలో వివేక్ అనే పాత్రలో కనిపించడం విశ్వక్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు ఈ సినిమా తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాతో తనలో ఉన్న దర్శకుడుని కూడా బయటకు తీశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.


ఇకపోతే విశ్వక్సేన్ రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. విశ్వక్సేన్ కొన్నిసార్లు చేసిన స్టేట్మెంట్స్ వలన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఒక ఫలక్నామా దాస్ సినిమా అప్పుడు కూడా కొంతమంది సినిమా పోస్టర్లు చంపడం వంటివి చేశారు. ఇక అశోక వనంలో అర్జున కళ్యాణం (Ashoka Vanamlo Arjun Kalyanam) సినిమా రిలీజ్ టైం లో కూడా చాలా కాంట్రవర్సి జరిగింది. విశ్వక్సేన్ నటించిన ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా దాని గురించి చిన్నదో పెద్దదో కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే ఇప్పటివరకు తన కెరీర్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకున్నాడు విశ్వక్. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ నటిస్తున్న సినిమా మెకానిక్ రాకి. మామూలుగా విశ్వక్సేన్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అని అంటే కొన్ని రోజులు ముందు నుంచి సోషల్ మీడియాలో కొంచెం హడావిడిగా ఉంటుంది. అలానే విశ్వక్ కూడా ఒకప్పుడు యాక్టివ్ గా ఉండటం వలన ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండేవాడు. మెకానిక్ రాకి సినిమాకు సంబంధించి అంతగా బజ్ లేదు అని చెప్పాలి.

మెకానిక్ రాకి సినిమా గురించి విశ్వక్సేన్ స్పందించాడు. సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం. టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి జెక్స్ బిజీయో సంగీతం అందిస్తున్నాడు. వివేక్ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం సినిమాకి కూడా జెక్స్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్క్ అయింది. అలానే మెకానిక్ రాఖీ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవ్వనుంది. ఈ సినిమా గురించి విశ్వక్ మాట్లాడుతూ ఇన్ని రోజులు బజ్ రాలేదు కాదు, నేనే బజ్ ఇయ్యలే అంటూ చెప్పుకొచ్చాడు ఇకపై ఈ సినిమా గురించి అప్డేట్లు వస్తూనే ఉంటాయి అని చెప్పాడు విశ్వక్. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకులు ముందుకు రానుంది.


Related News

Star Singer : విడాకుల బాటలో స్టార్ సింగర్… మూణ్ణాళ్ల ముచ్చట అయిపోయినట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ పై హైకోర్టు లో పిటిషన్.. ఏమైందంటే..?

Shiva Balaji : నువ్వో యాక్టర్ వి.. బేసిక్స్ నేర్చుకో ముందు.. స్టేజ్‌ పైనే పరువు తీసిన శివ బాలాజీ..!

Kerintha: పెళ్లి చేసుకున్న యంగ్ నటుడు.. అమ్మాయి ఎవరంటే..?

Bagheera Trailer: పాపాలు కడిగే టైమొచ్చింది.. యాక్షన్ సీక్వెన్స్ తో..!

Devara: ఆల్ టైం రికార్డ్.. దేవర మూవీకి ఎంత లాభం అంటే..?

Amalapaul: ఆ స్టార్ హీరోయిన్ వల్లే భర్తకు విడాకులు.. ఇదే ఊహించని ట్విస్ట్ అంటే..!

Big Stories

×