EPAPER

Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

Womens T20 World Cup 2024:  మహిళల టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్  విశ్వ విజేతగా  న్యూజిలాండ్ జట్టు నిలిచింది.  అందరూ ఊహించినట్లుగానే… ఫైనల్  మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బొక్క బోర్లా పడింది. దీంతో… ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించి… విశ్వ విజేతగా నిలిచింది.  టి20 మహిళల ప్రపంచ కప్  చాంపియన్ గా నిలిచింది  న్యూజిలాండ్ జట్టు.


 

ఫైనల్ మ్యాచ్లో… దక్షిణాఫ్రికా పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్.  నిర్నిత 158 పరుగుల లక్ష్యాన్ని… చేదించే క్రమంలో… దక్షిణాఫ్రికా చతికల పడింది. దీంతో విశ్వవిజేతగా న్యూజిలాండ్ జట్టు..నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్ లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. అనంతరం… చేజింగ్ కు దిగిన సఫారీ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టు… టి20 మహిళల ప్రపంచ కప్ ఎగిరేసుకు వెళ్ళింది. ప్రపంచ కప్ గెలవడం న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి కావడం విశేషం.


 

చేజింగ్లో మొదట సఫారీ జట్టు… దూసుకు వెళ్లినప్పటికీ… 15 ఓవర్ల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మ్యాచ్ మొత్తం న్యూజిలాండ్ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో ప్రపంచ కప్ విశ్వవిజేతగా నిలిచింది న్యూజిలాండ్. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. అలాగే ఇంగ్లాండు, వెస్టిండీస్ చెరొకసారి గెలిచాయి. ఇప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించింది.

 

Related News

Ms Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ధోని ఔట్..CSK యాజమాన్యం కీలక ప్రకటన ?

India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం..ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్ !

ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..

Ind vs Pak: పాకిస్తాన్ పై.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

Big Stories

×