EPAPER
Kirrak Couples Episode 1

New Year : ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సందడి.. 2023 కు గ్రాండ్ వెల్ కమ్..

New Year : ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సందడి.. 2023 కు గ్రాండ్ వెల్ కమ్..

New Year : కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు న్యూఇయర్ వేడుకలు బోసిపోయాయి. ఈసారి మాత్రం అంబరాన్నంటుతున్నాయి. మనదేశం కంటే ముందు కొన్ని దేశాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని కిరిబాటి దీవులు తొలుత కొత్త ఏడాదిని స్వాగతించాయి. వాస్తవానికి ఏటా సమోవా ద్వీపం కొత్త ఏడాదిని అందరి కంటే ముందే ఆహ్వానిస్తుండేది. కానీ ఈసారి ఆ దేశం టైమ్‌ జోన్‌ను మార్చుకుంది. దీంతో గతంలో కంటే గంట ఆలస్యంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది.


న్యూజిలాండ్‌లో న్యూఇయర్ సందడి
న్యూజిలాండ్‌ వాసులు 2023లోకి అడుగుపెట్టారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతం పలికింది. ఆనందోత్సాహాల మధ్య కివీస్‌ ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద న్యూఇయర్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

ఆస్ట్రేలియాలో భారత్ కంటే ఐదున్నర గంటల ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. జపాన్‌ మనకంటే మూడున్నర గంటల ముందే 2023ను ఆహ్వానించింది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా న్యూఇయర్ కు వెల్ కమ్ చెప్పాయి. మన పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలో అడుగుపెడతాయి.
సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2023లోకి అడుగుపెడతాం. అదే సమయానికి శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.


భారత్‌ తర్వాత ఐదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు. రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు జరుపుకుంటారు. రెండో వేడుక పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 14 జరుపుకుంటారు.

చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాంలో కొత్త సంవత్సరం వేడుకలను జనవరి 1న జరుపుకోరు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుపుకుంటారు.

Tags

Related News

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Big Stories

×