EPAPER

Google : వీటికి గూగుల్ ఎప్పుడో గుడ్​బై చెప్పేసిందని మీకు తెలుసా?

Google : వీటికి గూగుల్ ఎప్పుడో గుడ్​బై చెప్పేసిందని మీకు తెలుసా?

Google : అత్యుత్తమ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఎప్పుడూ ముందుంటుంది. ఎన్నో కొత్త ఉత్పత్తులను వినియోగదారులకు మనకు పరిచయం చేసింది. అలాగే ఆన్‌లైన్‌ సెర్చ్‌ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ఏదో ఒక కొత్త ఫీచర్​ను మనకు పరిచయం చేస్తూనే ఉంటుంది. అందుకే Google Services పాపులర్ సెర్చ్ ఇంజిన్ Google మన నిత్య జీవితంలో భాగమైపోయిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదనే చెప్పాలి.


ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గూగుల్‌కు సంబంధించిన ఏదో ఒక సేవను మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ముఖ్యంగా మ్యాప్స్​, జీమెయిల్, జీపే, మీట్​తో సహా ఇంకా ఎన్నో రకాల సేవలను మనకు వాడేస్తూ ఉంటాం. ఇలా అనేక రకాల సేవలను గూగుల్ ఎప్పటినుంచో మనకు అందిస్తూనే వస్తోంది. టెక్నాలజీ సాయంతో యూజర్లకు సులభమైన, మెరుగైన సేవలను అందిస్తూ యూజర్ల మన్ననలు పొందుతోంది.

READ ALSO :  అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్


అయితే ఇప్పటి వరకు గూగుల్ అందించిన వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల కొన్నింటిని గూగుల్ మూసి వేసింది. సేవలందిస్తున్న మరి కొన్నింటినీ (యాప్స్ కూడా) విలీనం చేసింది. అలా గూగుల్ గుడ్ బై చెప్పేసిన, అంటే ప్రస్తుతం అందుబాటులో లేని ఆ ప్రొడక్ట్స్​ ఏంటో తెలుసా?

orkut – దీనిని స్నేహితులు సంభాషించుకొనేందుకు గూగుల్ తీసుకొచ్చింది. ఫేస్ బుక్​ ఎంట్రీ వల్ల ఈ ఆర్కట్​కు ఆదరణ తగ్గింది. దీంతో 2004లో గూగుల్ ఈ ఆర్కట్​కు స్వస్తి పలికింది.

Google + – సెర్చ్ ఇంజిన్ క్వాలిటీని పెంచేందుకు దీనిని యూజర్స్​కు అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. అయితే 2019 నుంచే ఈ గూగుల్ ప్లస్ సేవల్ని నిలిపివేసింది గూగుల్ సంస్థ.

Google Duo – ఇది వీడియో కాలింగ్ కోసం యూజర్స్​కు ఉపయోగపడేది. దీనిని అందుబాటులోకి తెచ్చిన గూగుల్ – ఈ డ్యుయో సేవల్ని 2022లోనే నిలిపివేసింది. గూగుల్ మీట్​లోకి దీనిని విలీనం చేసింది.

Google Allo – ఇది ఇన్​స్టంట్​ మెసేజింగ్ సర్వీస్ సేవలను అందిస్తుంది. ​ గూగుల్ అల్లో పేరిట అప్పుట్లో గూగుల్ దీనిని తీసుకొచ్చింది. ఈ సర్వీస్​ను ఐదేళ్ల కింద గూగుల్ నిలిపివేసింది.

STADIA – గూగుల్ తీసుకొచ్చిన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ ఇది. యూజర్ల నుంచి ఆశించిన మేర స్పందన రాకపోవడం వల్ల కొద్ది కాలం క్రితమే ఈ సేవలను నిలిపివేసింది గూగుల్.

Google Podcasts – దాదాపు ఆరేళ్ల పాటు ఈ పాడ్​కాస్ట్​ సేవలు అందించింది. ఈ మధ్యే గూగుల్​ ఈ పాడ్​కాస్ట్​ సర్వీసును నిలిపివేసింది. అనంతరం యూజర్లను యూట్యూబ్​ మ్యూజిక్​కు మళ్లించింది గూగుల్.

ఇక వీటన్నిటిని గూగుల్ ఆపేసిందనే విషయం చాలామందికి తెలియదు. గూగుల్ పాడ్ కాస్ట్ ఇప్పటికి పనిచేస్తుందని చాలా మంది యూజర్స్ అనుకుంటూ ఉంటారు. పలు కారణాలతో గూగుల్ డియో, గూగుల్ పాడ్ కాస్ట్ వంటివి ఎంత ఫేమస్ అయినప్పటికీ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related News

Jio 5G : అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు 12 OTT సబ్‌స్క్రిప్షన్‌లను – అతి తక్కువకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

Flipkart Diwali Sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్ రేపే ప్రారంభం.. మోటోరోలా ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్

iQ00 13 : అదిరిపోయే డిజైన్ తో iQ00 13 లీక్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

Amazon Diwali sale : అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

Realme P1 smartphone : రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

Smartphone sales : ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

Big Stories

×