బాలీవుడ్‌లో ఎన్నో క్లాసికల్ హిట్స్‌లో భాగమయిన నటి నర్గీస్ ఫక్రీ. అక్టోబర్ 20న తన 45వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓ లుక్కేయండి.

నర్గీస్ తండ్రి పాకిస్థానీ, తల్లి యూరోప్‌లోని షేజ్ దేశానికి చెందింది. ఇక నర్గీస్ పుట్టింది మాత్రం న్యూయార్క్. అలా తను పక్కా హైబ్రిడ్ పిల్లగా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యింది.

అమెరికాలోనే తన మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది నర్గీస్. అమెరికాస్ నెక్స్‌ట్ టాప్ మోడల్ అనే షోలో పాల్గొని మోడల్‌గా మొదటి అడుగు వేసింది.

హాలీవుడ్‌లో సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది ఈ భామ. ఇక్కడ పలు యాడ్స్‌లో మోడల్‌గా కనిపించింది.

2011లో విడుదలయిన ‘రాక్‌స్టార్’ సినిమాతో హీరోయిన్‌గా మారింది నర్గీస్. అది క్లాసిక్ హిట్ అయ్యింది.

బాలీవుడ్‌లో బిజీ అయిన సమయంలోనే హాలీవుడ్ నుండి కూడా నర్గీస్‌కు అవకాశాలు వచ్చాయి.

15 ఏళ్ల నుండి ఆర్ట్స్‌ను నేర్పిస్తూ టీచర్‌గా పనిచేసిన నర్గీస్.. ఆ తర్వాత సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది.

ప్రస్తుతం నర్గీస్ ఫక్రీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గురించి అప్డేట్స్ అందిస్తుంటుంది నర్గీస్.

‘రాక్‌స్టార్’ హీరోయిన్‌గానే ఇప్పటికీ చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు తనను గుర్తుపెట్టుకొని బర్త్ డే విషెస్ చెప్తున్నారు.