Jio 5G : ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు , అలాగే ఇతర సిమ్ యూజర్స్‌ను తమ వైపు తిప్పుకునేందుకు ఎప్పటి కప్పుడు కొత్త ప్లాన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. Unlimited 5G డేటాను అందించేందుకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. కానీ ఆ సంస్థ తీసుకుచ్చే ప్లాన్లు వినియోగదారులకు కష్టంగా మారింది. అంత డబ్బులు చెల్లించి ప్లాన్లను రిచార్జ్‌లు చేసేందుకు కష్టపడుతున్నారు. అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో రిచార్జ్‌లు చేసుకుంటున్నారు.
ALSO READ: అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్
అయితే Unlimited 5G డేటాను అందించే రూ. 500 లోపు ఉన్న Jio ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలను ఓ సారి మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చాం. అదనంగా, వినియోగదారులు అపరిమిత కాల్లు, ఇతర ప్రయోజనాలను పొందే ప్లాన్ల వివరాలను ఇక్కడ పొందు పరుస్తున్నాం.
జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్రీపెయిడ్ జియో ప్లాన్ అపరిమిత 5G డేటాతో వస్తుంది. అలానే 2GB 4G డేటా/రోజు, 100 ఎస్సెమ్మెస్‌లు, 14 రోజుల పాటు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇంకా JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను కూడా అందిస్తోంది.
జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ రిచార్జ్ ప్లాన్ 28 రోజుల పాటు అపరిమిత 5G డేటాతో లభిస్తోంది. 2GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను పొందొచ్చు.
జియో రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత 5G డేటా, 2.5GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్లతో వస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ. అదనంగా, వినియోగదారులకు JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను అందిస్తోంది.
జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటా, 2GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్‌లను పొందవచ్చు. అలాగే 28 రోజుల పాటు జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. Jio TV యాప్ ద్వారా సోనీ లివ్, జీ5, లయన్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్, కంచ్చా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫ్యాన్ కోడ్, Hoichoi వంటి 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇంకా
జియో రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ Jio రూ. 449 ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లను 28 రోజుల పాటు అందిస్తుంది. JioTV, JioCinema, JioCloud ఉచిత సభ్యత్వాలను అందిస్తుంది. ఇంకా అపరిమిత 5G డేటా, 3GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు అందిస్తుంది.
మొత్తంగా ఈ ప్లాన్లతో, యూజర్స్ తమ బడ్జెట్‌ను మించకుండా అపరిమిత 5G డేటాను పొందొచ్చు. మరింత డేటా కావాలంటే, రూ. 399 లేదా రూ. 449 ప్లాన్లను ఓ సారి చూడండి. ఫైనల్‌గా అపరిమిత 5G డేటా, ఎక్కువ OTT సబ్స్క్రిప్షన్లను కోరుకునే వారికి, రూ. 448 ప్లాన్ బెస్ట్ ఛాయిస్.