EPAPER

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

Rain Alert to Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలర్ట్. రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండ మాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


ఈ అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 23 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు ఈ నెల 24న వాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని తెలిపింది.

దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.


ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Related News

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు? త్వరలోనే కీలక ప్రకటన!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

JC Diwakar Reddy Biopic : తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?

EX MINISTER RK ROJA : ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

AP CM Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

IAS PRASHANTHI : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Big Stories

×