EPAPER

Laughing Buddha: లాఫింగ్ బుద్దా ఎవరో తెలుసా? ఆ విగ్రహం అంత పాపులర్ కావడానికి కారణాలు ఇవే

Laughing Buddha: లాఫింగ్ బుద్దా ఎవరో తెలుసా? ఆ విగ్రహం అంత పాపులర్ కావడానికి కారణాలు ఇవే

Who Is Laughing Buddha: లాఫింగ్ బుద్దా. పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఏ దుకాణానికి వెళ్లి, హోటల్ కు వెళ్లినా, వ్యాపార, వాణిజ్య సంస్థలకు వెళ్లినా, మొదట కనిపించేది లాఫింగ్ బుద్దా విగ్రహం. చాలా మంది ఇళ్లలోనూ ఈ విగ్రహాన్ని వాస్తు ప్రకారం పెట్టుకుంటారు. చూడగానే నవ్వు తెప్పించేలా ఉన్న ఈ విగ్రహం కేవలం బొమ్మకాదు. కుటుంబ శ్రేయస్సు, ఆనందం, సంపద, సంతృప్తి కలింగించే చిహ్నంగా భావిస్తారు. ఈ విగ్రహం ఉన్న చోటల్లా సుఖశాంతులు, ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు నమ్ముతారు. అసలు ఇంతకీ ఈ లాఫింగ్ బుద్దా ఎవరు? ఈ విగ్రహం ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం తలుపు తడుతుందా?


తెలిసిన వారికి దేవుడు, తెలియనివారికి బిచ్చగాడు

లాఫింగ్ బుద్దా గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. లాఫింగ్ బుద్దా అసలు పేరు హోథాయ్. జపాన్ కు చెందిన ఆయన ఓ బౌద్ధ బిక్షువు. 1000 సంవత్సరాలుగా బతికినట్లు జపాన్ ప్రజలు చెప్పుకుంటారు. ఎన్నో ఏండ్ల పాటు ఆయన తపస్సు చేసి జ్ఞానోదయం పొదారు. జ్ఞాన సంపద లభించిన తర్వాత, పలు దేశాల్లో తిరిగారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలను నవ్వించే వారు. ఆయనను చూసిన ప్రజలంతా తమ కష్టాలను మర్చిపోయి సంతోషంగా ఉండేవాళ్లు. నిత్యం ఆయన భుజం మీద సంచి, చేతిలో పాత్ర ఉండేది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరు ఏది అడిగినా దాన్ని తన సంచిలో నుంచి తీసి ఇచ్చేవారు.


ఎవరికి ఏం ఇచ్చినా అతడి సంచి మాత్రం ఖాళీ అయ్యేది కాదు. తెలియని వాళ్లు అతడిని ఓ బిచ్చగాడిగా చూస్తే, తెలిసిన వాళ్లు భగవంతుడిగా కొలిచే వారు. ఇతడిని చూసిన వాళ్లంతా రోజంతా హ్యాపీగా ఉండేవారు. ప్రజలకు నవ్వులు సంతోషాన్ని పంచే వారు కాబట్టి అతడిని లాఫింగ్ బుద్దాగా పిలవడం మొదలు పెట్టారు. లాఫింగ్ బుద్దాను ఆనందానికి గుర్తుగా భావిస్తారు. లాఫింగ్ బుద్దాను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో ఆనందం,  సంతోషం కలుగుతుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్దాను చూడటం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందంటున్నారు.  జపాన్ ప్రజలు అతడిని ఏడుగురు అదృష్ట దేవతలలో ఒకరిగా భావిస్తారు. అందుకే ఈ విగ్రహాన్ని చాలా మంది తమ దుకాణాలలో, ఇళ్లలో పెట్టుకుంటారు.

లాఫింగ్ బుద్దాను ఇంట్లో ఎటువైపు పెట్టాలి?

లాఫింగ్ బుద్ధా ఇంట్లోకి వస్తే బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఇంట్లో ప్రతికూల ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పలువురు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఆనందం, సంతోషం, ప్రశాంతత ఉండాలంటే లాఫింగ్ బుద్దాను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈశాన్యం వైపు పెట్టడం వల్ల కూడా శుభం కలుగుతుందంటున్నారు. విద్యార్థుల గదిలో పెట్టడం వల్ల వారికి స్ట్రెస్ రిలీఫ్ కలిగి చదువు మీద ఎక్కువగా ఫోకస్ పెడతారని చెప్తున్నారు. సో, మీరు కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపే లాఫింగ్ బుద్దాను తెచ్చిపెట్టుకోండి!

Read Also: సాయంత్రం పూట పూలు తెంపకూడదంటారు ఎందుకు? సైన్సు చెప్పిందిదే

Related News

Diwali 2024: దీపావళి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఎన్ని రోజులు ఈ దీపాల పండుగ జరుపుకోవాలి?

Horoscope 22 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇష్టదేవతారాధన శుభప్రదం!

Budh Gochar 2024: ధన్‌తేరాస్‌లో మిథునం, సింహంతో సహా ఈ 4 రాశుల అదృష్టం మారుతుంది

Diwali Vastu Tips: దీపావళి నాడు ఇంట్లో ఈ మొక్కను నాటితే అప్పులన్నీ తీరిపోతాయి

Diwali 2024 : దీపావళి నాడు ఈ రాశుల వారు రాత్రికి రాత్రే రాజులు అవుతారు..

Jupiter Retrograde Effects: ఒక సంవత్సరం వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సంక్షోభం తప్పదు

Big Stories

×