EPAPER

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Navya Haridas BJP : కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీపై బీజేపీ నవ్య హరిదాస్ ను బరిలోకి దించనుంది.


దేశవ్యాప్తంగా ఆసక్తికరం…

ఈ నేపథ్యంలోనే త్వరలో నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో ఈ స్థానంపై దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భారత దేశ రాజకీయ వ్యవస్థలోని అన్ని పార్టీలు వయనాడ్ లోక్ సభ సీట్ పై ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారో అన్న ఆసక్తి అందరికీ ఉంది. ఇప్పుడు ఈ స్థానం పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలవడం గమనార్హం.


తాను వదిలిన వయనాడ్ స్థానంలో గెలుపు కోసం రాహుల్ గాంధీ తన చెల్లిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో గెలవాలని, తద్వారా అమేథీ, రాయబరేలీ మాదిరే దీన్ని కూడా తమ కుటుంబానికి దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.  మరోవైపు బీజేపీ సైతం ఈ స్థానంపై కన్నేసింది.

బీజేపీ ఆశలన్నీ నవ్య మీదే…

ఎలాగైనా ప్రియాంక గాంధీని ఓడించి ఈ స్థానంలో బీజేపీ జెండా పాతాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక‌పై కేర‌ళ బీజేపీ మ‌హిళా మోర్చా ప్రధాన కార్యదర్శి న‌వ్య హ‌రిదాస్‌ను బీజేపీ ఖ‌రారు చేసింది. ఫలితంగా వీరి మధ్య రసవత్తరమైన పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

39 ఏళ్ల నవ్య హరిదాస్‌ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో స్టార్ లైన్ లోకి వచ్చిన ఈమె ఎవరు, ఈమె రాజకీయ నేపథ్యం గురించి నెట్టింట సైతం జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఆమె సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చి స్టార్ గా మారారు.

బీటెక్ చదివిన నవ్య హరిదాస్…

అందరి యువతుల మాదిరే జీవితంపై ఎన్నో ఆశలు, కలలు ఉన్న అమ్మాయిగా బీటెక్‌ చదవిన హరిదాస్, ఆ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో రాజకీయ అర్రంగేట్రం చేశారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా బీజేపీలో తన ముద్ర వేశారు. అనతి కాలంలోనే జాతీయ స్థాయి నేతల దృష్టిలో పడ్డారు. దీంతో వయనాడ్‌ టికెట్‌ సాధించగలిగారు.

మెకానికల్ ఇంజనీర్

2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన నవ్య, తర్వాత మెకానికల్ ఇంజనీర్‎గా ఉద్యోగం చేశారు. తర్వాత రోజుల్లో రాజకీయాలు ఆమెను ఆకర్శించాయి. ఈ మేరకు రాజకీయాల్లో చేరిన నవ్య హరిదాస్, కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా రెండుసార్లు గెలిచారు. ఈ క్రమంలోనే పార్టీ అనేక అవకాశాలను ఇచ్చింది. దీంతో ఆమె బీజేపీలో ఓ బలమైన శక్తిగా మారారు. అలా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు.

క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్…

ఇక 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌వ్వ ఎన్డీఏ అభ్య‌ర్థిగా కొజికోడ్ ద‌క్షిణం నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. కొసమెరుపు ఏంటంటే, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని వెల్లడించింది. అలాగే నవ్య చేతిలో రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయట. మొత్తంగా రూ.1,64,978 అప్పులు కకూడా ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది.

నవంబర్ 13న తుది సమరం…

వయనాడ్ ఉపఎన్నిక నవంబర్ 13న జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టి అంతా ఈ స్థానం మీదే కేంద్రీకరించి  ఉంది. దీంతో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగాయి. ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Also Read :

also read : కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

Related News

RAHUL GANDHI : ఆదివాసీ, వనవాసీలకు తేడా చెప్పేసిన రాహుల్ గాంధీ… ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై మండిపాటు

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం

BJP Corporator Son: పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. ఎలా చేసారో తెలుసా?

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Big Stories

×