EPAPER

CM Reventh Reddy: హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Reventh Reddy: హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గొప్ప నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.


మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతోమంది నాయకులు మనందరికీ ఆదర్శమన్నాని, నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నామన్నారు. ఒక్కోసారి నాయకులు డబ్బు, సమయం, వ్యక్తిగత జీవితం అన్నీ త్యాంగ చేయాలన్నారు.

మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలన్నారు. ముఖ్యంగా సిగ్గు పడకుండా ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నవారంతా తెలంగాణతోపాటు దేశానికి అంబాసిడర్లు అన్నారు.


తెలంగాణను ఒక ట్రిటియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నారు. హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా ఉండాలన్నారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చలేనని, న్యూయార్క్, లండన్, పారిస్‌తో పోల్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడంతో మీరంతా 2 నుంచి 3 ఏళ్లు ఇక్కడే పనిచేయాలన్నారు.

ఇక్కడి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చన్నారు. కానీ మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ అందిస్తుందన్నారు. దురదృష్ణవశాత్తు ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకాలు గెలవలేకపోయిదని, రానున్న కాలంలో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వ్యాపారల్లో రాణిస్తున్న వారంతా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని, భవిష్యత్తులో మీరంతా ఎక్కడికెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడాలని కోరారు.

 

Related News

GO 317 : సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక

MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా

 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం

Governor bandaru dattatreya: బండారు దత్తాత్రేయ కారుకు రోడ్డు ప్రమాదం.. ఢిల్లీ వెళ్తుండగా ఘటన

pubs task force raids: దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!

Metro Police Hotel : మెట్రో పోలీస్ యజమాని అరెస్ట్, హోటల్ సీజ్, హైదరాబాద్ పోలీసులు, ముంబయికి వెళ్లి మరీ ?

Big Stories

×