EPAPER

Bigg Boss: బిగ్ బాస్ హిస్టరీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..!

Bigg Boss: బిగ్ బాస్ హిస్టరీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..!

Bigg Boss.. చాలా తక్కువ గుర్తింపుతో బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నాగ మణికంఠ (Naga manikanta) సింపథీ ప్లే చేస్తూ.. ఏడు వారాలు నెట్టుకొచ్చారని చెప్పాలి. అంతేకాదు హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు మూడు వారాలలో సెంటిమెంట్ తో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న నాగమణికంఠ ఆ తర్వాత తన ఆటలో మెరుగు కనబరుస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. టాస్క్ లలో సత్తా చాటుతూ.. రికార్డు సృష్టించి అనూహ్యంగా బిగ్ బాస్ ఏడవ వారం ఎలిమినేట్ అయ్యారు. ఈయన ఎలిమినేషన్ ఎవరు ఊహించలేదని చెప్పాలి. ముఖ్యంగా టాప్ – 5 లో కచ్చితంగా ఉంటాడని అందరూ భావించగా.. అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడమే కాదు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.


అనూహ్యంగా ఎలిమినేట్ అయిన మణికంఠ..

పైగా నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి టెలికాస్ట్ కానుంది. అయితే 7 వారాలు మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు గానూ కేవలం రూ.7,00,000 మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గంగవ్వతో చెప్పగా.. ఈ విషయం కాస్త బయటపడింది. ఈ రూ.7లక్షలు కూడా మణికంఠకి పూర్తిగా రాద. పైగా ఇందులో 20 శాతం జీఎస్టీ, ఇతర టాక్స్ లు కూడా పడతాయి. ఒకరకంగా చెప్పాలి అంటే అవన్నీ కట్ అయ్యి మణికంఠ చేతికి కేవలం రూ .5లక్షలు మాత్రమే వస్తాయని సమాచారం. ఈ విషయం తెలియడంతోఈ మాత్రం సంపాదన కోసం బిగ్ బాస్ హౌస్ కి రావడం ఎందుకు..? బయట సీరియల్స్ చేసినా వచ్చేది కదా.. అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తుంటే, మరికొంతమంది డబ్బు రాకపోతేనేం గుర్తింపు వచ్చింది కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.


ఏడు వారాలకు గానూ వచ్చింది రూ .5లక్షలే..

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ కి కేవలం డబ్బు సంపాదించడానికి వచ్చానని మణికంఠ అనేక సందర్భాలలో తెలిపిన విషయం తెలిసిందే. తన భార్య ప్రియా దగ్గర తన విలువ పెరగాలంటే డబ్బు సంపాదించాలని, అందుకే గేమ్ బలంగా ఆడి టైటిల్ గెలవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ హౌస్ లో కొనసాగి ఉండి ఉంటే ,టాప్ -5 వరకు వెళ్లి ఉంటే కచ్చితంగా భారీ మొత్తంలోనే సంపాదించేవాడేమో.. కానీ తానే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవాలని అనుకున్నాడు కాబట్టి చేసేదేమీ లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ 7 వారాలు కేవలం మణికంఠ చుట్టూ మాత్రమే తిరిగిందని చెప్పడంలో సందేహం లేదు. సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ ఎలా అయితే పాపులారిటీ దక్కించుకున్నారో ఇప్పుడు మణికంఠ కూడా అలాగే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఇకపోతే బయటకు వెళ్లిన తర్వాత ఆఫర్స్ వస్తాయని, కెరియర్ బాగుపడుతుందని అందరూ ఆశిస్తున్నారు.

బిగ్ బాస్ చరిత్రలో తక్కువ పారితోషకం అందుకున్న కంటెస్టెంట్ ..

ఇదిలా వుండగా..బిగ్ బాస్ చరిత్రలోనే తక్కువ పారితోషకం తీసుకున్న కంటెస్టెంట్ గా నిలిచిపోయారు మణికంఠ . ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వారానికి రూ. 1.50లక్షకు పైగా పారితోషకం ఇస్తుంటే, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరికి రూ.4లక్షల రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చారని సమాచారం. దీనికి తోడు అవినాష్ ,హరితేజ, రోహిణి, టేస్టీ తేజ వంటి భారీ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ కి రూ .4లక్షల కంటే ఎక్కువ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తక్కువ రెమ్యునరేషన్ తో సరిపెట్టుకున్నారు మణికంఠ.

Related News

Bigg Boss 8 Day49 Promo 3: మీమ్స్ తో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో అలాంటి పని చేస్తే అంతే.. విన్ అవ్వడం కష్టం, స్మార్ట్‌గా తప్పించుకున్న పృథ్వి

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ వయసు బయటపెట్టిన టేస్టీ తేజ.. పృథ్వి, అవినాష్ ఓవరాక్షన్‌పై నాగ్ కౌంటర్

Bigg Boss 8 Day 49 Promo 1: చిత్రం భళారే విచిత్రం.. మరో కొత్త టాస్క్ తో..!

Bigg Boss 8 Telugu : హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ .. ఏడో వారం ఇద్దరు అవుట్ ?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ స్టోరీ.. నాగార్జున రియాక్షన్ ఏంటంటే?

Big Stories

×