EPAPER

Naga Vamsi: ట్విటర్ ఎక్కువగా చూస్తే ప్రతోన్ని పిలిచి కొట్టాలని అనిపిస్తుంది

Naga Vamsi: ట్విటర్ ఎక్కువగా చూస్తే ప్రతోన్ని పిలిచి కొట్టాలని అనిపిస్తుంది

Naga Vamsi: ఒకప్పుడు సినిమా దర్శకులు నిర్మాతలు అభిమానులకి, ప్రేక్షకులకు అవైలబుల్ గా ఉండేవాళ్ళు కాదు. కానీ ప్రస్తుత కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆడియో ఫంక్షన్ జరిగి ఆ పాటలు మార్కెట్లో వచ్చేవి వాటి ద్వారా సినిమా పైన మంచి అంచనాలు పెరిగేవి. కానీ ప్రస్తుతం మాత్రం టీజర్ ట్రైలర్ అంటూ సినిమా నుంచి కొంత కంటెంట్ చూపించి ప్రేక్షకుడిని ఆకర్షించడం మొదలుపెట్టారు మేకర్స్. వాస్తవానికి ఒక ప్రేక్షకుడిని సినిమా వరకు తీసుకురావాలి అంటే ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. అలానే కొన్ని ట్రైలర్లు బాగున్నాయి కూడా సినిమా అంతగా ఏమీ అనిపించదు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా చూసినా కూడా ఆ సినిమా గురించి క్షణాల్లో టాక్ ట్విట్టర్లో వైరల్ అవుతుంది.


కొంతమంది ఫిలిం మేకర్స్ కూడా తనకేదైనా ఒక సినిమా నచ్చినప్పుడు దాని గురించి ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. అయితే అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూల్ లేదు. కొందరికి కొన్ని సినిమాలు విపరీతంగా నచ్చితే ఇంకొందరికి అవే సినిమాలు తలనొప్పిగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఒపీనియన్ చెప్పినప్పుడు ట్రోల్ కి గురి అవ్వడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో నిర్మాత వంశీకి మంచి అనుభవం ఉంది అని చెప్పాలి. అవతార్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమా పైన కామెంట్స్ చేశారు వంశీ. అయితే ఆ కామెంట్స్ ను చాలామంది సీరియస్ గా తీసుకొని వంశీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. విజువల్ వండర్ మూడు గంటల పాటు తలనొప్పి పట్టుకుంది అని కామెంట్ చేయడంతో కేవలం వంశీని మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ట్రోల్ చేశారు. దీనికి కారణం వంశీ త్రివిక్రమ్ కి పెద్ద అభిమాని. ఇక అక్కడ నుంచి కొంతమేరకు ట్విట్టర్ వాడకాన్ని తగ్గించాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమా సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. దీనిలో చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. దీంట్లో భాగంగా ట్విట్టర్ వాడకాన్ని తగ్గించినట్లు ఉన్నారు అని అడిగితే అవును తగ్గించాను.ట్విటర్ ఎక్కువగా చూస్తే ప్రతోన్ని పిలిచి కొట్టాలని అనిపిస్తుంది అంటూ చెబుతూ వచ్చాడు. మామూలుగా వంశీకి మంచి టెంపర్ ఉన్న విషయం చాలా ప్రెస్ మీట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు వంశీ అసలు మాట్లాడేవాడు కాదు గాని రీసెంట్ టైమ్స్ లో ఏ ప్రశ్న అడిగినా కూడా సరైన సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. రీసెంట్ గా దేవర సినిమాతో మంచి లాభాలు పొందుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశాడు వంశీ.


Tags

Related News

Hero Navadeep: కష్టాల్లో యంగ్ హీరో.. స్టార్ హీరో ఎంట్రీ తో..!

Mechanic Rocky Trailer: బలవంతంగా విశ్వక్ సేన్‌ను మెకానిక్‌గా మార్చిన తండ్రి.. ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తాడో?

Akkineni Amala: రూ.వేల కోట్లు ఉన్నా.. ఆ సమస్య నుంచి బయటపడని అమల.!

Prabhas: ప్రభాస్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. కార్ కలెక్షన్ చూస్తే మతి పోవాల్సిందే..!

KCR: ప్లేట్ మార్చిన రాకింగ్ రాకేష్.. KCR ను వెనక్కి నెట్టింది అందుకేనా..?

Salman Khan: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Aadi Saikumar: ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు ఆది ప్రమోషన్స్.. ఇదేదో కొత్త సినిమాలకు చేయొచ్చుగా!

Big Stories

×