EPAPER

Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూత.. శోకసంద్రంలో..!

Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూత.. శోకసంద్రంలో..!

Kiccha Sudeep.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సమంత (Samantha), నాని (Nani) జంటగా నటించిన చిత్రం ఈగ (Ega). ఈ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యారు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈయన తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి మరణించినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


కిచ్చా సుదీప్ కి మాతృవియోగం..

ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ (Saroja Sanjeev) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వృద్ధాప్య రీత్యా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బెంగళూరులోని జయానగర్ లో ఉన్న అపోలో హాస్పిటల్లో ఆమె చేరారట. గత కొద్దిరోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమెకు చికిత్స ఫలించక ఆదివారం ఉదయం 7:00 గంటలకు ఆమె తదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె మరణాన్ని కిచ్చా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని విని మరింత దుఃఖితులవుతున్నారు.


కిచ్చా సుదీప్ కెరియర్..

కర్ణాటక ఇండస్ట్రీకి చెందిన ఈయన, 1973 సెప్టెంబర్ 2న జన్మించారు. భారతీయ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్న ఈయన స్క్రీన్ రైటర్, టెలివిజన్ వ్యాఖ్యాత అలాగే మంచి గాయకులు కూడా.. ఎక్కువగా కన్నడ చిత్రాలలో పని చేసే ఈయన తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారిపోషకం తీసుకునే నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్న సుదీప్.. 2013 నుండి ఇండియాలోనే టాప్ 100 ప్రముఖుల ఫోర్బ్స్ జాబితాలో మొదటి కన్నడ నటులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకున్న ఈయన నంది అవార్డును కూడా దక్కించుకున్నారు.

విద్యాభ్యాసం…

1997లో వచ్చిన తాయవ్వ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించిన ఈయన ఆ తర్వాత 1999 ప్రత్యర్థ అనే సినిమాలో సహాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తర్వాత పలు సినిమాలలో నటించిన ఈయన తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రం ఈగ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈయన విద్యాభ్యాసం విషయానికి వస్తే.. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో సంజీవ్ మంజప్ప, సరోజ సంజీవ దంపతులకు జన్మించారు. చిక్మంగళూరు జిల్లా నరసింహారాజపుర నుండి షిమోగాకు వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన సుదీప్.. బెంగళూరులోని దయానంద సాగర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. అండర్ – 17 క్రికెట్లో కూడా కళాశాలకు ప్రాతినిధ్యం వహించి.. ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో విద్య నేర్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.ఇకపోతే కిచ్చా సుదీప్ కి తన తల్లి అంటే ఎంత ప్రేమ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పలు స్టేజీల పైన తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఇటీవల బిగ్ బాస్ స్టేజ్ పై కూడా తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు సుదీప్. ఇప్పుడు తల్లి మరణంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

KCR: ప్లేట్ మార్చిన రాకింగ్ రాకేష్.. KCR ను వెనక్కి నెట్టింది అందుకేనా..?

Salman Khan: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Aadi Saikumar: ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు ఆది ప్రమోషన్స్.. ఇదేదో కొత్త సినిమాలకు చేయొచ్చుగా!

Salman Khan: సల్మాన్ చెల్లెలికి కూడా బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కుటుంబం..!

Naga Vamsi: ట్విటర్ ఎక్కువగా చూస్తే ప్రతోన్ని పిలిచి కొట్టాలని అనిపిస్తుంది

Devi Sri Prasad: మహేష్ బాబు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన దేవిశ్రీప్రసాద్

Tollywood: ప్రముఖ నటికి హత్య బెదిరింపులు.. అసలేమైందంటే..?

Big Stories

×