EPAPER

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం నడుస్తుంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయనే ప్రత్యక్ష ఉదాహరణ. సొంత లెక్కలతో తన పని తాను చేసుకుంటూ సైలెంట్ అయిన ఆ నేత గత ఎన్నికల ముందు ఒక్కసారిగా ఫోకస్ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. అదే ఆయన రాజకీయ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పటికే గడ్డుకాలం ఎదుర్కొంటున్న సదరు నేత టైం మరింత వరస్ట్‌గా తయారైంది. ఇక కెరీర్ ముగిసిపోయే పరిస్థితికి తెచ్చింది. అయినా ఆయన్ని దురదృష్టం వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆయన వారసురాలు ప్రత్యర్ధి పార్టీలో చేరి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా అన్‌లక్కీ పొలిటీషియన్ అంటారా?


ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా మంచి పేరు తెచ్చుకున్న లీడర్. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్.. మొదటి సారి 1977లో ప్రత్తిపాడు నుంచి జనతా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగింది. 1985-89 మధ్య కాలంలో అప్పటి విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా కాపునాడును స్థాపించినప్పుడు ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్రగడ కాపునాడు వ్యూహకర్తగా వ్యవహరించారు.

రంగా హత్య తర్వాత కాపునాడు కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొన్న ముద్రగడ కాపు నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1985లో టీడీపీలో మంత్రిగా ఉంటూ రిజైన్ చేసి కాంగ్రెస్ బాట పట్టిన ఆయన 1989 ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రిగా పనిచేశారు. తిరిగి టీడీపీలోకి వచ్చి 1999లో కాకినాడ ఎంపీగా గెలిచారు.. ఇక అదే ఆయనకు చివరి గెలుపు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లినా ఆయన ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ సొంత అజెండా నడిపించుకున్నారు.


నిలకడ లేని నిర్ణయాలతో అప్పటికే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడకి అసలు సిసలు బ్యాడ్ టైం 2024 ఎన్నికల ముందు స్టార్ట్ అయింది. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా నమ్మిన ముద్రగడ గత ఎన్నికల ముందు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. అప్పటి దాకా జనసేన తలుపులు తట్టిన ఆయనకు అవి తెరుచుకోకపోవడంతో కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఆ ఇద్దరికీ టికెట్లు ఇవ్వకుండా ప్రచారానికి వాడుకుని పక్కన పెట్టేశారు.

Also Read:  పవన్ ప్లాన్ అదుర్స్.. సైలెంట్ గా సర్వం సిద్దం.. అందుకే గేట్లు ఓపెన్ చేశారా..

ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం.. సీటు దక్కకపోయినా విధిలేని పరిస్థితుల్లో కేవలం జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. అంతటితో ఆగని ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఎన్నికలలో గెలవనివ్వబోనని సినీ స్టైల్లో శపధం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని బహిరంగంగానే ప్రకటించారు.

అప్పుడే ముద్రగడ కుటుంబంలో ముసలం మొదలైంది. ఆయన అలా శపధం చేయగానే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి బార్లపూడి ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని తమ సామాజిక వర్గ కాపులంతా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్న నేపథ్యంలో తన తండ్రి అలాంటి ప్రకటన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ ని దూషించేందుకు మాత్రమే వైసీపీ తన తండ్రిని వాడుకుంటుందని ఆమె అప్పట్లో ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆమె తండ్రిని ప్రశ్నించారు.

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకుంటున్నానని ఈ విషయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభం తో పూర్తిగా విభేదిస్తున్నానని క్రాంతి అప్పట్లోనే ప్రకటించారు. దానిపై ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్ అయ్యారు. ఆడపిల్లకు పెళ్లి జరిగిన పుట్టింటితో సంబంధం ఉండదని.. మెట్టినింటికే ఆమెపై రైట్స్ ఉంటాయని.. పెళ్లి అయ్యాక తన ప్రాపర్టీ కాదంటూ చిత్రమైన లాజిక్ వినిపించారు.

జగన్ పార్టీలో చేరాను కడ వరకు ఆయనతో తన పయనమని ముద్రగడ ప్రకటించారు. అప్పటినుండి ముద్రగడ ఆయన కూతురు క్రాంతి మధ్య విభేదాలు తరా స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించి, డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ముద్రగడ తాతా.. పేరు ఎప్పుడు మార్చుకుంటావంటూ జనసైనికులు, నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో కాపునేత ముద్రగడ కాస్తా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని సొంతూరు కిర్లంపూడికే పరిమితమైపోయారు.

తాజాగా క్రాంతి జనసేనలో చేరడంతో ముద్రగడ పద్మానాభరెడ్డి పేరు మరో సారి హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన కుమార్తె జనసేన తీర్థం పుచ్చుకుని తన అభిమానం చాటుకున్నారు. మరోవైపు వైసీపీ ఆయన్ని వాడుకుని వదిలేస్తుందని ఎన్నికల ముందే క్రాంతి చెప్పారు. నిజంగా అలాగే జరుగుతుంది. ఎలక్షన్‌ తర్వాత ముద్రగడను వైసీపీ పెద్దలు పలకరించిన పాపాన పోలేదు. ఈ వ్యవహారం అంతా చూస్తూ అందరూ ముద్రగడపై తెగ జాలి పడిపోతున్నారు. పగాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదంటారు ఇదేనేమో.

Related News

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Ratan Tata: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Big Stories

×