EPAPER

TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

TTD Wedding Gifts: అసలే పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. ఎక్కడ చూసినా బాజాభజంత్రీలు మ్రోగనున్నాయి. ఇప్పటికే ముహూర్తాల కోసం అర్చకులను సంప్రదిస్తున్నారు పెద్దలు. అయితే ఇలా నూతన వధూవరులకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశం కల్పించింది టీటీడీ. ఆ దేవదేవుని ఆశీర్వచనంతో నిండు నూరేళ్లు వర్ధిల్లే అవకాశం మీకు ఉచితంగా లభిస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే..


దీపావళి పండుగ అనంతరం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. డిశంబర్ వరకు పెళ్లిళ్ల హడావుడి ఉండనుంది. అందుకే కాబోలు ఇప్పటి నుండే వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాల్స్ ఇప్పటి నుండే బుక్ అవుతున్నాయి. అయితే హిందువులు తొలి పెండ్లిపత్రికను ముందుగా తమకు ఇష్టమైన దైవానికి సమర్పిస్తారు. అనంతరం తమ కుటుంబ సభ్యులకు అందజేస్తారు. తమ ఇష్టమైన దైవాల ఆలయాలు సమీపంలో ఉంటే.. అక్కడికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించి పూజలు నిర్వహించి, వివాహానికి సంబంధించిన అన్ని కార్యాలను ప్రారంభిస్తారు. సుదూరాన ఉన్న ఆలయాలకు మాత్రం పెళ్లైన అనంతరం నూతన వధూవరులు దర్శించి పూజలు నిర్వహిస్తారు.

అయితే దూరాన ఉన్న ఆలయాలకు అదే పెళ్లికార్డు పంపిస్తే.. అక్కడి నుండి స్వామి వారి కానుకలు అందితే ఆ భక్తుల ఆనందం వేరు. అందుకే కాబోలు టీటీడీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఎన్నో ఏళ్లుగా శ్రీకారం చుట్టి, విజయవంతంగా నిర్వహిస్తోంది. సుదూరంలో ఉన్న శ్రీవారి భక్తులు.. తమ వివాహ వేళలో స్వామి వారికి పెళ్లిపత్రికను సమర్పించి, స్వామి వారి ఆశీస్సులు పొందే అవకాశమిది. అసలే వివాహాల కాలం కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందండి మరి.


పెళ్లికి తిరుమల శ్రీవారి కానుక పొందండి ఇలా..
వివాహం జరుగుతున్న సంధర్భంగా తొలి పెండ్లిపత్రికను శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు. దూరాన ఉన్న భక్తులు, నేరుగా శ్రీవారికి పత్రికను సమర్పించలేరు. అటువంటి వారి కోసం టీటీడీ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకై మొదటగా వివాహం నిశ్చయమైన అనంతరం ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపాల్సి ఉంటుంది. అనంతరం శ్రీవారి విశిష్టమైన కానుక ఉచితంగా తిరుమల నుండి నూతన వధూవరులకు అందుతుంది. అందులో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షింతలు, వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి కూడా ఆ కానుకలో ఉంటుంది. ఇలా శ్రీవారి ఆశీస్సులతో మీ వివాహం జరుపుకోవచ్చు. ఇంతటి గొప్ప భాగ్యం కలగడం అదృష్టమే కదా..

Also Read: Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకుందాం

పెళ్లికార్డు పంపాల్సిన చిరునామా ఇదే
తిరుమల శ్రీవారి కానుక పొందేందుకు పెళ్లికార్డును Sri Lord Venkateswara swamy, The Executive Officer, TTD Administrative Building, K.T.Road, Tirupati, 517501 అడ్రస్ కు రిజిస్టర్ పోస్ట్ చేయాలి. అనంతరం పెళ్లికార్డుపై ఉన్న అడ్రస్ కు శ్రీవారి కానుక అందుతుంది.

ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలపాల్సిందే. ఎందుకంటే దేవదేవుని ఆశీర్వచనాలతో, అక్షింతలతో కళ్యాణ వైభవం జరగడం ఎంతో అదృష్టమే కదా. ఈ అవకాశం సుదూర ప్రాంతాలలో ఉన్న భక్తులకు చక్కని అవకాశమని చెప్పవచ్చు. మీ పెళ్లి జరగనుందా.. అయితే శ్రీవారికి పెళ్లి పత్రిక సమర్పించి ఈ కానుక పొందండి సుమా!

Related News

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

IAS PRASHANTHI : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Tirumala Tickets Issue: ఏ పాపం తెలియదు.. కుట్ర జరుగుతోందంటున్న జకియా ఖానమ్.. సంబంధం లేదంటున్న బొత్స

CM Chandrababu: కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

Divvala Maduri: దివ్వెల మాధురి ఇంటికెళ్లిన పోలీసులు.. స్వయంగా నోటీసులు జారీ.. ఏ కేసులో తెలుసా!

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

Big Stories

×