EPAPER

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Delhi Air Pollution: నీటిలోనే కాదు ఢిల్లీలోని గాలి కూడా కాలుష్యంతో నిండి పోయింది. పవిత్రమైన యమునా, ప్రాణాధారి అయిన గాలీ.. ఈ రెండూ విషపూరితంగా మారి, మందపాటి చలి మంచుతో కలుస్తుంటే.. ప్రజల గుండెల్లో పొల్యూషన్ పేరుకుపోతోంది. రక్తం బదులు కాలుష్యం పారుతుందేమో అనిపిస్తోంది. వినడానికి అతిశయోక్తిలా అనిపించినా.. భరిస్తున్న ఢిల్లీ వాసుల జీవితాలు ఈ పరిస్థితికి సాక్ష్యంగా ఉన్నాయి.


2018 నుండి చూసుకుంటే 2024 జనవరి అత్యంత కలుషితం

ఇక, ఢిల్లీలో పెరుగుతున్న పర్యావరణ కష్టాలను మరింత రెట్టింపు చేస్తూ.. ఢిల్లీలో రోజువారీ గాలి నాణ్యత కూడా దారుణంగా దిగజారుతోంది. ఇప్పటికే దట్టమైన పొగమంచు ఢిల్లీని కప్పేస్తుండగా.. మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293కి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం, చలికాలం సమీపిస్తున్న తరుణంలో వాయుకాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా కలిసి ఢిల్లీవాసుల్ని భయానికి గురిచేస్తున్నాయి. అసాధారణంగా చలీ, కాలుష్యం ఈ సంవత్సరం జనవరిలో ఢిల్లీవాసుల్ని పట్టి పీడించింది.


రాజధాని నగరం గాలి నాణ్యత ప్రకారం, 2018 నుండి చూసుకుంటే 2024 జనవరి నెల అత్యంత కలుషితమైన చలి కాలంగా ఉంది. సగటు వాయు సూచిక దాదాపు 354గా నమోదయ్యింది. 13 సంవత్సరాలలో అత్యంత శీతలమైన జనవరి రోజుల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఈరోజుల్లో ఇక్కడ సగటున ఉష్ణోగ్రత 17.7 డిగ్రీల సెల్సియస్.. ఇన్నేళ్ల కనిష్ట సంవత్సరాల్లో.. రెండవ కనిష్ట ఉష్ణోగ్రత, సగటున ఉదయం వేళ 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. దీని ప్రకారం, రాబోయే జనవరి నెల ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే భయాలు ఇప్పుడే మొదలయ్యాయి.

2021 జనవరి సగటు AQI 324తో అత్యంత కలుషితం

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AQI డేటా ప్రకారం, 2018 నుండి 2024కి మధ్య చూస్తే.. 2021 జనవరి నెల సగటు AQI 324తో అత్యంత కలుషితమైనదిగా నమోదయ్యింది. ఇక, ఈ జనవరిలో గత సంవత్సరాల కంటే చాలా ఎక్కువ కాలుష్యం ఏర్పడింది. నగరం మొత్తం తీవ్ర కలుషితమైన రోజులను చూసింది. CPCB లెక్కల ప్రకారం, సున్నా-50 మధ్య ఉన్న AQI “మంచిది” అని అర్థం. అలాగే, 51-100 మధ్య “సంతృప్తికరం”గా భావించాలి. 101-200 “మధ్యస్థం” అయితే.. 201-300 మధ్య “బాలేదనీ”, 301-400 మధ్య “చాలా పేలవం” అనీ.. 400 దాటితే “చాలా తీవ్రంగా”గా పరిగణించలని అర్థం.

Also Read: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..

దీన్ని బట్టి ఈ ఏడాది నమోదైన గాలి కాలుష్యం అస్సలు మంచిది కాదని తెలుస్తోంది. ఇక, ప్రస్తుత పరిస్థితి చూస్తే.. అక్టోబర్ 15న AQI 357తో చాలా పేలవంగా నమోదయ్యింది. అక్టోబర్ 16న కూడా పెద్దగా మెరుగుపడలేదు. అయితే, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్న చలి నెలల్లో కాలుష్యం ఎక్కువగా ఉండడం యాదృచ్ఛికం కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎందుకంటే, చల్లని రోజులు మరింత కలుషితమవడానికి అవకాశం ఉంటుంది. కనుక, ప్రస్తుతమున్న కాలుష్యంతో పాటు చలి తోడైతే ఢిల్లీ వాతావరణం దారుణంగా మారుతుంది.

యమునా కాలుష్యం, చలిలో పెరుగుతున్న గాలి కాలుష్యానికి తోడు ఇటీవల ఢిల్లీలో వరదలు పెను ముప్పుగా పరిణమించాయి. యమునా ఫ్లడ్ ప్లెయిన్స్ ప్రాంతంలో విపరీతంగా పెరుగుతున్న కట్టడాలు, ఆక్రమణలు దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ శ్రేణులలో విపరీతంగా కురస్తున్న వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గతం రికార్డులను బద్ధలు చేస్తూ ఇటీవల కాలంలో వచ్చిన వర్షాలకు యమునా నది ఉధృతికి ఢిల్లీ నగరంలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే, ఈ పరిస్థితి ఇంతటితో ఆగేది కాదు. రానున్న కాలంలో ఢిల్లీ నగరం మరిన్ని వరద ముప్పులను ఎదుర్కోవాల్సి రావచ్చన్న ఆందోళన ఇప్పటికే నిపుణులు వెల్లడించారు. ఇప్పుడిక మేల్కోకపోతే.. రాజధాని నగరం నరకంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.

Related News

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

Ratan Tata: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Big Stories

×