EPAPER

Nindu Noorella Saavasam Serial Today October 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకునేందుకు మిస్సమ్మ ప్లాన్‌ – మిస్సమ్మను డైవర్ట్‌ చేయాలనుకున్న మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today October 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకునేందుకు మిస్సమ్మ ప్లాన్‌ – మిస్సమ్మను డైవర్ట్‌ చేయాలనుకున్న మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today Episode:  అసలు ఆరు అక్కా ఎవరు? నాకే ఎందుకు గిఫ్ట్‌ ఇచ్చి వెళ్లిపోయింది. అంటూ మిస్సమ్మ ఆలోచిస్తుంటి. దీంతో కరుణ ఆ అక్క పేరేంటని అడుగుతుంది. తెలియదని మిస్సమ్మ చెప్తుంది. కనీసం ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడుగుతుంది. తెలియదు. పక్కిల్లు అని చెప్పింది కానీ ఈ పక్కిళ్లా ఆ పక్కిళ్లా కూడా తెలియదు అంటుంది మిస్సమ్మ. దీంతో కరుణ కోపంగా భాగీని తిడుతుంది. పేరు, ఊరు తెలియని ఆమెను అక్కా అని పిలిచావా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.


అసలు ఎవ్వరికీ కనిపించని నీకు మాత్రమే కనిపించే ఆ అక్క ఎవరు? ఎందుకే ఆమె ఈ ఇంటి చుట్టే తిరుగుతుంది ఒకసారి బాగా ఆలోచించు అంటూ కరుణ ప్రశ్నార్థకంగా అడుగుతంది. దీంతో మిస్సమ్మ గతంలోకి వెళ్తుంది. ఆరు చెప్పిన ప్రతి మాట గుర్తు చేసుకుంటుంది. ఒక సందర్భంలో ఆరు ఈ ఇంటి పెద్దకోడలును, పిల్లలుక తల్లిని అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే భయంగా బిగుసుకుపోతుంది మిస్సమ్మ. దీంతో కరుణ ఇప్పుడు ఎందుకే అట్ల బిగుసుకుపోయినవ్‌.. అంటూ అడగ్గానే అది ఆ పక్కింటావిడే.. ఆరు అక్కనేమో అని డౌట్‌ గా ఉందే అనగానే కరుణ భయంతో ఏందే ఏం మాట్లాడుతున్నావే నువ్వు.. చనిపోయిన ఆమె ఈ బతికున్న ఆమె ఎట్లైతదే.. అని అడుగుతుంది.

మిస్సమ్మ  తెలియదే.. కానీ ఒక్కసారి ఆలోచించు. ఆవిడ ఈవిడ ఒక్కరే అయితే మన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతది కదా? అంటుంది. అవును పోరి  నువ్వు చెప్తుంటే నాకు కూడా గట్లనే అనిపిస్తుంది అంటుంది కరుణ.  కానీ ఈ విషయం ఎలా కన్‌ఫం చేసుకోవాలి. అది కన్‌ఫం అని తెలుసుకునేంత వరకు ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ తెలియకూడదే..పొద్దనే చూశావు కదే అంజు ఎలా ఏడ్చిందో అంటుంది మిస్సమ్మ. సరే అంటుంది కరుణ . ముందు నువ్వు ఆరు  అక్క ఫోటో చూడు అప్పుడు ఇద్దరు ఒక్కటేనా కాదా అన్న విషయం క్లారిటీ వస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది కరుణ.


ఆరు ఆత్మను సీసాలో బంధించి పూజలో పెట్టి మంత్రాలు చదువుతుంటాడు ఘోర. ఘోరకు ఎదురుగా  మనోహరి కూర్చుని చూస్తుంటుంది. సీసాలో ఉన్న ఆరు నన్ను వదిలేయండి అంటూ  ఏడుస్తుంది. అబ్బా దీని బాధ చూస్తుంటే జాలిగా ఉంది ఘోర నాకు..  త్వరగా ఆత్మను నీ ఆధీనంలోకి తెచ్చుకో.. అంటూ ఘోరకు చెప్పగానే నేను అనుకున్న పని చేయడానికి ఒక పూజ దూరంలో ఉన్నాను.. కొన్ని గంటల దూరంలో ఉన్నాను మనోహరి. ఇక ఆ ఆత్మ కథ ముగిసిపోతుంది అంటూ గట్టిగా సంతోషంగా చెప్తాడు ఘోర.

సీసాలో ఉన్న ఆరు ఏడుస్తూ మీ ఇద్దరికి నేను ఏం అన్యాయం చేశానని ఇలా వేధిస్తున్నారు నన్ను. మను నా ప్రాణాలను తీసేశావు. నేను కలలు కన్న జీవితం కూడా నాకు కాకుండా చేశావు. అయినా ఇంకా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మను. అంటూ ఆరు ప్రశ్నిస్తుంది. ఇంతలో మనోహరి నువ్వు ఏం అంటున్నావో వినిపించదు. నువ్వు ఎలా ఉన్నావో  కనిపించదు. కానీ కచ్చితంగా నువ్వు నిస్సహాయంగా ఏడుస్తుంటావు అని తెలుస్తుందే అంటుంది మనోహరి.

ఇంతలో ఘోర, మనోహరిని ఇంటికి వెళ్లమని చెప్తాడు. లేదు నేను ఇక్కడే ఉంటానని మనోహరి చెబితే పూజ అయిపోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అదికాక పూజ నిష్టతో ఏకాగ్రతతో చేయాలి నువ్వు ఇక్కడే ఉంటే కష్టం అందుకే వెళ్లమంటున్నాను మనోహరి అని చెప్పగానే సరే అయితే రేపు ఉదయం వస్తాను అని చెప్పి మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నిర్మల, శివరాంల దగ్గరకు మిస్సమ్మ వచ్చి ఆరు ఆక్క  ఫోటో ఇవ్వండి ఒకసారి చూస్తాను అని అడుగుతుంది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న మనోహరి డోర్‌ దగ్గరే నిలబడి వింటుంది. మిస్సమ్మ మాటలకు షాక్‌ అవుతుంది. ఇప్పుడు ఇది ఆరును చూస్తే ప్రమాదం అనుకుంటుంది. ఇంతలో నిర్మల ఏంటి మిస్సమ్మ నువ్వు ఇన్ని రోజుల ఆరు ఫోటో చూడలేదా? అని ప్రశ్నిస్తుంది. లేదు అత్తయ్యా చూసాను ఒక్కసారి కానీ ఎలా ఆరు అక్క  ఎలా ఉంటుందో మర్చిపోయాను. అదీ కాక పిల్లలు బాధపడుతున్నారు కదా? వాళ్లను ఓదార్చడానికి అడిగాను అని చెప్తుంది మిస్సమ్మ.

అయితే ఈ విషయం అమర్‌ తో చెప్పొద్దు. ఇందాకే పిల్లుల వచ్చి ఆరు ఫోటో అడిగితే ఇచ్చాం. ఇవాళంతా వాళ్ల దగ్గరే పెట్టుకుంటారట అని శివరాం చెప్తాడు. నిర్మల కూడా  ఈ విషయం అమర్‌ కు తెలియనివ్వకు అమ్మా.. మళ్లీ ఆరు ఫోటో చూసి పిల్లలు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారని ఆరు ఫోటోను ఇవ్వనివ్వడు అంటుంది. సరే అంటుంది మిస్సమ్మ.

బెడ్‌రూంలో అంజు, ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నిన్ను అందరూ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది అన్నారు. కానీ మమ్మల్ని వదిలేసి నువ్వు దేవుడి దగ్గరకు వెళ్లవని నాకు తెలుసమ్మా.. నీ ఆశీర్వాదం తీసుకున్నానమ్మా.. నా బాధ చూసి నాకోసం నువ్వు వచ్చావు కదా..? అంటూ ఏడుస్తుంది.

ఇంతలో అమ్ము ధైర్యం తెచ్చుకుని కన్నీల్లు తుడుచుకుని  అమ్మ కళ్లముందు లేకపోతే మనతో లేనట్టేనా..? అమ్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అంజు అని చెప్తుంది. ఇంతలో ఆకాశ్‌ కూడా  అవును అంజు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకే బాధగా ఉంది. అమ్మకెలా ఉంటుంది చెప్పు అంటాడు. మనం ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉంటేనా కదా? అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అని ఆనంద్‌ చెప్తాడు. అంజు మాత్రం ఆరు ఫోటో పట్టుకుని అలాగే ఏడుస్తుంది.

నిర్మల, శివరాంలకు మిస్సమ్మ నేను పిల్లల దగ్గరకు వెళ్తున్నాను. వారికి కొంచెం ధైర్యం చెప్తాను అంటుంది. సరే మిస్సమ్మ వాళ్లను నువ్వే ఓదార్చాలి అంటారు. మిస్సమ్మ పైకి వెళ్తుంది. డోర్‌ దగ్గర నిలబడి అంతా గమనిస్తున్న మనోహరి టెన్సన్‌ పడుతుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. అనుకుంటుంది. వెంటనే అమర్‌ విషయం చెబితే సరి అనుకుంటుంది.

మరోవైపు మిస్సమ్మ పిల్లల రూంలోకి వెళ్లి చూస్తుంది. అప్పటికే ముగ్గురు పిల్లలు పడుకుని ఉంటారు. అమ్మును వెళ్లి ఆరు అక్క ఫోటో ఎక్కడుందని అడుగుతుంది మిస్సమ్మ. అంజు పట్టుకుని ఇప్పుడే నిద్ర పోయిందని చెప్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Lakshmi V’s Anu: లక్ష్మీ వర్సెస్ అనూ.. దీపావళి పటాస్ లా పేలేదెవరు..?

Trinayani Serial Today October 20th: ‘త్రినయని’ సీరియల్‌:  హాసిని వల్లే నయనికి గండం అన్న విశాలాక్షి – నయనిని చంపేందుకు తిలొత్తమ్మ ప్లాన్‌

Intinti Ramayanam Today Episode: అవని పై ఫోకస్ పెట్టిన పల్లవి.. అవని చెప్పిన అబద్దం కు అక్షయ్ షాక్ .. అసలు ట్విస్ట్ ఇదే ..

GundeNinda GudiGantalu Today Episode : మీనా తన భార్య కాదని చెప్పిన బాలు .. రెచ్చిపోయిన ప్రభావతి .. సంజు రియాక్షన్ ..

Satyabhama Today Episode: రేణుకను కాపాడిన సత్య .. రుద్రను పోలీసులకు పట్టించిన సత్య.. సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య..

Brahmamudi Serial Today October 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌, కావ్యను కలిపేందుకు అపర్ణ కొత్త ప్లాన్‌ – మొదటిసారి కనకాన్ని మెచ్చుకున్న మూర్తి

Big Stories

×