EPAPER

Ratan Tata: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

Ratan Tata: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

Ratan Tata: రతన్ టాటా.. భారతదేశ గర్వించదగిన బిజినెస్ టైకూన్. మరణించి పది రోజులవుతోంది. అందరూ మెచ్చిన మానవాతావాది. అయితే, రతన్ టాటా ఆస్తి కూడా అంతే ఎక్కువ. ఆయన మరణం తర్వాత తన వేల కోట్ల రూపాయల ఆస్తికి ఎవరు వారసులు అనే చర్చలు మొదలయ్యాయి. లాభాల కంటే చిత్తశుద్దికి ప్రాధాన్యత ఇచ్చిన రతన్ టాటా కష్టపడి కూడబెట్టిన ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది. అసలు, ఆయన విల్లులో ఏం రాశారు అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. టాటా సన్స్ బోర్డులో నోయల్ టాటా నియమితులైనప్పటికీ… రతన్ టాటా ఆస్తిపై ఇంకా క్లారిటీ రానట్లే కనిపిస్తుంది. మరి, ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది..? అసలు, టాటా విల్లులో ఏముంది..?


ఆయన ఆస్తి దాదాపు రూ.7,900 కోట్లని ఒక అంచనా

2024 అక్టోబర్ 9.. యావత్ భారతదేశం మెచ్చిన రతన్ టాటా దివంగతులయ్యారు. తన 86వ ఏట టాటా అనారోగ్యంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్‌గా ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు రతన్ టాటా ఆస్థులు ఎవరికి వెళతాయనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం, రతన్ టాటా అవివాహితులు కావడమే. సొంత వారసులు లేకపోవడం వల్ల ఆయన సంపాదించిన వేల కోట్లు ఎవరికి దక్కుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఆస్తి దాదాపు రూ.7 వేల 900 కోట్లుగా ఒక అంచనా ఉంది. అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని రతన్ టాటా ఎవరి చేతిలో పెట్టారు అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. దీని కోసం ముందుగా ఆయన వీలునామాలో ఏం రాశారన్నది తెలియాల్సి ఉంది. వీలునామాలో ఉన్న ప్రకారమే చట్టబద్ధంగా ఈ ఆస్తిని పంచాలీ, లేదంటే, నిర్వహించాల్సి ఉంటుంది. మరి, ఈ వీలునామాలో ఏముందీ..?


టాటా సన్స్‌లో రతన్ టాటాకు 0.83 శాతం వాటాలు

తన కంపెనీలను అభివృద్ధి చేస్తూ… తన కంపెనీలపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం ఆలోచించిన రతన్ టాటా ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా వ్యాపారం చేసిన వ్యక్తి. అయితే, ఇదే సంకల్పాన్ని నెరవేరాల్చిన బాధ్యత ఆయన వారసులకు ఉంది. కొన్ని నివేదిక ప్రకారం, రతన్ టాటా వీలునామాను అమలు చేయడానికి న్యాయవాది డారియస్ ఖంబటా, టాటా సన్నిహిత మిత్రుడు, సహచరుడు మెహ్లీ మిస్త్రీ, టాటా సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్‌లను నియమించినట్లు తెలుస్తోంది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో రతన్ టాటాకు 0.83 % వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం, రతన్ టాటా నికర విలువ రూ.7వేల 900 కోట్లుగా ఉంది. రతన్ టాటా తన సంపదలో ఎక్కువ భాగం దాతృత్వానికి, సమాజానికి వెళ్లాలని ఎప్పుడూ అనుకునేవారు. కాగా, ఈ నలుగురూ కలిసి రతన్ టాటా ఆశయాలను, ఆశలను ముందుకు తీసుకెళ్లడానికి వీటిని వినియోగించాలి. అంతకంటే ముందు, ఆయన సంపాదించిన ఆస్తిని వీలునామాకు తగ్గట్లు అమలు చేయాలి.

Also Read: తరతరాల నుంచి టాటా అంటే ఇదే..

సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌ల ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ

ప్రస్తుతం టాటా తన వీలునామాలో ఆస్తులతో పాటు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, వీలునామా సిద్ధం చేయటంలో సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబట్టా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లకు ట్రస్టీగా టాటా స్నేహితుడు, సన్నిహితుడైన మెహ్లీ మిస్త్రీ ఉన్నారు. ఈ రెండు ట్రస్టులు కలిపి సంయుక్తంగా టాటా సన్స్‌లో 52 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నాయి. అంటే, ప్రధాన వాటాలో సగంపైనే అనమాట. ఇక, టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌ల మొత్తం వాటా 66 శాతంగా ఉండగా.. లిస్టెడ్ కంపెనీల్లో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ.16.71 లక్షల కోట్లుగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇక, రతన్ టాటా ఆస్థిలో ఎక్కువ భాగం టాటా సన్స్‌లో వాటాల రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ వీలునామా వివరాలపై టాటా సన్నిహితుడు మిస్త్రీ కానీ, ఆయన సవతి సోదరీలు జేజీబోయ్‌లు కానీ ఇంతవరకూ స్పందిచలేదు. జేజీబోయ్‌లు రతన్ టాటా ల్లి సూనూ సర్ జమ్‌సెట్జీ జెజీబోయ్‌తో జరిగిన రెండవ వివాహం నుండి పుట్టిన కుమార్తెలు. అయితే, రతన్ టాటాకు అత్యంత ఇష్టమైన వాళ్లు కూడా. అందుకే, ఈ ఆస్తి యావత్తూ ఇప్పుడు వారే నిర్వహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

లిస్టెడ్ కంపెనీల్లో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ.16.71 లక్షల కోట్లు

ప్రస్తుతం, టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు చూస్తున్నారు. అయితే టాటా గ్రూపుపై పూర్తి ఆధిపత్యం చెలాయించే టాటా ట్రస్ట్ అధికారం రతన్ టాటా ఇష్టపడే సవతి సోదరీలకు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. అయితే, ఇందులో తర్వాతి తరం లీడర్స్ కూడా ఈ ట్రస్ట్‌లు, వ్యాపారాలు నిర్వహించడానికి నిశ్శబ్దంగా తమను తాము తయారు చేసుకుంటున్నారు. టాటా గ్రూప్ తర్వాతి తరం నాయకుల్లో రతన్ టాటా సోదరుడు నోయెల్ నావల్ టాటా పిల్లలు లేహ్ టాటా, మాయ టాటా, నెవిల్లే టాటాలు ఉన్నారు. ఇక, రతన్ టాటా సోదరీమణులు ఎప్పుడూ దాతృత్వ సేవల్లో ముందుంటారనే టాక్ ఉంది. టాటా సోదరి డీన్నా 1990ల్లో, 2000 ప్రారంభం వరకూ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా ఉన్నారు. మరి, ఈ ఆస్తిలో టాటా కజిన్స్‌కి ఎంత వాటా ఉందీ… వారి పిల్లలు, తర్వాతి తరంలోని వారికి ఎంత వాటా ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక, న్యాయవాది కంబట్టా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత రెండు ప్రైమరీ ట్రస్టులకు ట్రస్టీగా గత ఏడాది తిరిగి నియమింపబడ్డారు. వృత్తిపరమైన ఇబ్బందుల వల్ల 2016లో ట్రస్ట్‌ల నుండి వైదొలిగి, ఇప్పుడు తిరిగి వచ్చారు.

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు

అయితే, చట్ట ప్రకారం, ఎవరి వీలునామా అయినా దాన్ని అమలు చేసే వ్యక్తి.. వర్తించే చట్టాలను దృష్టిలో ఉంచుకుని మరణించిన వ్యక్తి చివరి కోరికలను నెరవేర్చాలి. ఇక, చట్టం కచ్ఛితంగా చెప్పే సూత్రం ఏంటంటే, వీలునామా అమలు చేయనంత వరకు, మరణించిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, వారి ఆస్తులను అదే పద్ధతిలో నిర్వహించాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులకు ఉంటుంది. సాధారణంగా, మరణించిన వ్యక్తి వారి విచక్షణ ప్రకారం వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొనని ఏదైనా ఆస్తులను డిస్పోజ్ చేయవచ్చు. అయితే, నిర్దిష్టంగా వీలునామాలో అలాంటి ప్రస్తావన చేయకపోతే, మరణించిన వ్యక్తి వ్యక్తిగత చట్టం ప్రకారం ఆ ఆస్తులు విభజించబడతాయి. దీన్ని బట్టి, రతన్ టాటా వ్యక్తిగత పెట్టుబడి అయిన RNT అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2023 ఆర్థిక సంవత్సరం వరకు రూ.186 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇవి ప్రస్తుత మార్కెట్ విలువతో కాకుండా, సంపాదించిన అసలైన ధరతో ముడిపడి ఉంటాయి. అయితే, ఇవి అప్పటి నుండి పెరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి, మిస్త్రీ, రతన్ టాటాలు మాత్రమే RNT అసోసియేట్స్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక, తేలాల్సింది మిగిలిన ఆస్తి వ్యవహారాలు.

Related News

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Big Stories

×