Pushpa 2: టాలీవుడ్ యంగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,రష్మిక మందన్నవహిస్తున్నారు జంటగా నటిస్తున్న సినిమా “పుష్ప 2” . ఈ సినిమా గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది . ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొద్దీ రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ రెట్టింపు అవుతున్నాయి. జనాల్లో అదే క్యూరియాసిటీని పెంచేందుకు పుష్ప టు టీం కూడా ఒక్కొక్క అప్డేట్ ను వదులుతూ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 తేదీన థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఓ సాంగ్ షూట్ మినహా మిగతా పార్ట్ పూర్తయింది పార్ట్ పూర్తయింది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఎవరు నటిస్తారో అన్న ఆసక్తి ఫ్యాన్స్ కు ఎక్కువైంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మామా.. అంటూ ఓ రేంజ్ లో ఊపేసింది అయితే ప్రస్తుతం పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ లో ఏ హీరోయిన్ తో స్టెప్పులు వేయిస్తారో అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ ని దించుతున్నారంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండనుందని.. దాని కోసం స్టార్ బ్యూటీని తీసుకునేందుకే ఇంకా ఆ పాట షూటింగ్ జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే, ఈ పాట కోసం చాలా మంది పేర్లను అనుకున్నా, ‘దేవర’తో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్న జాన్వీ కపూర్‌ని తీసుకుంటారనే టాక్ విపరీతంగా వైరల్ అయ్యింది.
కానీ ఇప్పుడు హీరోయిన్ మారిపోయింది. సాహో తో మంచి క్రేజ్ ను అందుకున్న శ్రద్ధా కపూర్ తో ఈ ఐటమ్ సాంగ్ నుచేయిస్తారని, అందుకోసం ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ సినిమా నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ సాంగ్ కోసం శ్రద్ధా ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పాటను అతిత్వరలో షూట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ‘పుష్ప-2’ చిత్రంలో జాన్వీని కాదని, ఐటెం సాంగ్ కోసం శ్రద్ధా తీసుకున్నారా లేదా అనేది చూడాలి ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్.. సినిమా విడుదలవకముందే కోట్లను కొల్లగొట్టుతుంది ఇప్పటికే ఫ్రీ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని టాక్ వినిపిస్తుంది మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ కు సొంతం చేసుకుంటుందో, ఉంటుందో ఎంత కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి..