EPAPER

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ స్టోరీ.. నాగార్జున రియాక్షన్ ఏంటంటే?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ స్టోరీ.. నాగార్జున రియాక్షన్ ఏంటంటే?

Bigg Boss 8 Telugu: బుల్లితెరపై టాప్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే పేరు గుర్తుకొస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ జరుగుతుంది. ఇప్పటికే హౌస్ లో ఆరు వారాలు పూర్తిచేసుకుని ఏడో వారానికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. ఈ వారం పృథ్వి ఎలిమినే హౌస్ నుంచి బయటికి వెళ్లే ఛాన్స్ ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున చేసే హంగామా అంతా కాదు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ ఎపిసోడ్ ల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. నిన్న శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఎవరికి క్లాసులు ఇచ్చారో, ఎవరిని పొగిడాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బిగ్బాస్ హౌస్ లో లవ్ ఎఫైర్ అనేవి కామన్ ఏడు సీజన్లో కొరకు లవ్ ట్రాక్ల మీద వచ్చిన ఎపిసోడ్లు మంచి అందుకున్నాయి. మంచి టాక్ ను అందుకున్నాయి. లవ్ ట్రాక్స్ మొదలయ్యాయి. మొన్నటి వరకు సోనియా పృథ్వి నిఖిల్ అనే పేర్లు వినిపించాయి. ఇప్పుడు విష్ణు ప్రియ పృథ్వి పేర్లు వినిపిస్తున్నాయి. చాలా వారాలుగా విష్ణుప్రియ-పృథ్వీ స్టోరీ చూసి చూసి ఆడియన్స్‌కి కూడా బోర్ కొట్టేసింది. దీంతో కొత్త స్టోరీకి తెరలేపారు.. తాజాగా హౌస్ లో మరో లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో మెగాచీఫ్ గా కొనసాగుతున్న గౌతమ్.. యష్మీతో ఒంటరిగా మాట్లాడాడు. నేను సింగిల్.. నా వయసు 28. నాకు కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి.. అయితే గేమ్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అన్నట్లుగానే నేను చూస్తా.. అందుకే స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నా. నాకు నీ మీద లైకింగ్ ఉంది.. కొంచెం క్రష్ అలా అనుకో.. ప్రస్తుతం అది ఆ స్టేజ్‌లోనే ఉంది ఇక అది ముందుకెళ్తుందో లేదో నీ చేతుల్లోనే ఉంది అనేసి గౌతమ్ యష్మికి ప్రపోజ్ చేస్తాడు కానీ యష్మి మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గౌతంతో సిగ్గుపడుతూ చూస్తుంది. నేను ఫ్లర్ట్‌ చేస్తున్నా.. చేస్తా కూడా.. అలా అని చెప్పి నేను ఏం ఫోర్స్ చేయను.. నీ ఇష్టం అంటూ గౌతమ్ తన మనసులో మాట చెప్పేశాడు. ఇక యష్మీ నువ్వు నీలానే ఉండు.. నాకు నువ్వు చేసేది ఏమైనా డిస్ట్రబ్‌గా అనిపిస్తే నేను చెబుతా.. కానీ ఇప్పటివరకూ అలా ఏం అనిపించలేదు.. కానీ ఒక ఫ్రెండ్‌గా అయితే ఉంటా.. అంటూ యష్మీ చెప్పింది

ఈ విషయాన్ని పృథ్వీ చెవిలో ఊదేసింది యష్మీ. పృథ్వీ ఉన్నాడంటే అక్కడ విష్ణుప్రియ కూడా ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకోండి. రేయ్ గౌతమ్ నాతో మాట్లాడాడు అంటూ యష్మీ చెప్పగా అవును ఉదయం నుంచి మాట్లాడుతున్నాడుగా అంటూ విష్ణు డైలాగ్ వేసింది. అయితే యష్మీ మనసులో నిఖిల్ ఉన్నట్లు బయటకు చెప్పేసింది ఇక గౌతమ్ ని కూడా అలానే చూస్తున్నట్లు చెప్పడంతో నాగార్జున షాక్ అవుతాడు. ఇప్పటివరకూ జరిగిన విషయాలన్నీ గమనిస్తే యష్మీ మనసులో నిఖిల్ ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే హౌస్‌లో నిఖిల్‌తో ఉన్నంత క్లోజ్‌గా యష్మీ ఎవరితోనూ ఉండదు. పృథ్వీతో కూడా ఉన్నా దానికి కొన్ని బౌండరీలు ఉన్నాయి. కానీ నిఖిల్ విషయంలో అలా కాదు. . నిఖిల్ టాస్క్ లో గెలిచినందుకు ముద్దు కూడా పెట్టేసింది.. అంటే యష్మీ మనసులో నిఖిల్ ఉన్నట్లు మొత్తానికి అర్థం అయిపోయింది మరి అటు గౌతమ్ ఇటు నిఖిల్ లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి..


Related News

Bigg Boss 8 Day 49 Promo 1: చిత్రం భళారే విచిత్రం.. మరో కొత్త టాస్క్ తో..!

Bigg Boss 8 Telugu : హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ .. ఏడో వారం ఇద్దరు అవుట్ ?

Bigg Boss 8 : షాకింగ్ ఎలిమినేషన్… మెడ పట్టి గెంటక ముందే బయటపడ్డ కంటెస్టెంట్

Bigg Boss 8 Day 48 Promo 1: వీకెండ్స్ మజా.. కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేసిన హోస్ట్..!

Bigg Boss 8 Remuneration: పృథ్వీ అవుట్.. 7 వారాలకు గానూ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Bigg Boss : ఇంటికి కొత్త మెగా చీఫ్.. గంగవ్వ ఆశీర్వాదంతో..!

Big Stories

×