EPAPER

Flowers: సాయంత్రం పూట పూలు తెంపకూడదంటారు ఎందుకు? సైన్సు చెప్పిందిదే

Flowers: సాయంత్రం పూట పూలు తెంపకూడదంటారు ఎందుకు? సైన్సు చెప్పిందిదే

పువ్వులు స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి. అందుకే ఇష్టదేవుళ్లను పువ్వులతోనే పూజిస్తారు. ఇది మన కంటికి కాదు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వేడుకల సమయంలో కచ్చితంగా పువ్వులు ఉండాల్సిందే. అయితే పువ్వులు ఎప్పుడు పడితే అప్పుడు తెంపడానికి వీలు లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆచారాలు, పురాణాల్లో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూమతంలో గులాబీలు, మల్లెపూలు, తామర పువ్వులు, బంతి పువ్వులు ఎక్కువగా ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత పువ్వులు కోయడం మంచిది కాదని పూర్వం నుంచి పెద్దలు ఒక నమ్మకంగా పెట్టుకున్నారు. ఇలా సాయంత్రం పూట పువ్వులు ఎందుకు కోయకూడదో ఎప్పుడైనా ఆలోచించారా?


సాయంత్రం పూట పూలు ఎందుకు కోయకూడదంటే వాటికి కూడా నిద్రా చక్రం ఉంటుంది. మనం ఎలా రాత్రి అయ్యేసరికి నిద్రపోతామో అవి కూడా సాయంత్రానికి విశ్రాంతి దశలోకి చేరుకుంటాయి. పగటిపూట మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. ఆ క్రియలో ఆక్సిజన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. అలా ఉత్పత్తి చేయడం వల్లే అది పెరుగుతాయి. కానీ సూర్యాస్తమయం అవుతున్న కొద్దీ అవి పనులు చేయడం తగ్గిపోతుంది. దీనివల్ల మొక్కలు కూడా నిద్రిస్తాయనే నమ్మకం వచ్చింది. రాత్రిపూట పువ్వులను తెంపకూడదని చెప్పడానికి ఇది కూడా ఒక కారణమే.

మరో వాదన ప్రకారం దేవతలు తమకిష్టమైన పువ్వులలో నివసిస్తారు. లక్ష్మీదేవి తామర పువ్వు పై కూర్చుంటుంది. ఇక కాళీమాతకు మందారపువ్వు అంటే ఎంతో ఇష్టం. ప్రతి హిందూ దేవుడికి బంతి పువ్వును ఆరాధిస్తారు. సాయంత్రం పూట పూలు కోయడం వల్ల దేవతలకు లేదా మొక్కల్లోని ఉన్న దైవిక శక్తిని భంగం చేసినట్టు అవుతుందని నమ్ముతారు.


Also Read: హిందూ పండుగలకు, వేడుకలకు బంతిపూలనే ఎందుకు ఎక్కువ వాడతారు? దీని వెనుక ఇంత కథ ఉందా?

సైన్స్ కోణంలో చూస్తే సాయంత్రం రాత్రి సమయాల్లో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ నుండి శ్వాసక్రియకు మారే కాలం ఇది. పగటిపూట కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించిన మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. కానీ రాత్రి పూట లేదా సాయంత్రం పూట అవి కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి. అందుకే పువ్వుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యంపై కార్బన్ డయాక్సైడ్ ప్రభావం పడకుండా ఉండేందుకు పువ్వులు కోయవద్దని అంటారు.

నిజానికి పువ్వులను ఊరికే కోసి పక్కన పడేయడం అంత మంచి పద్ధతి కాదు. పువ్వులు ఉండడం వల్లే పర్యావరణ చక్రం సక్రమంగా సాగుతుంది. తేనెటీగలు, పక్షులకు, పువ్వుల్లోని పుప్పొడి ఎంతో అవసరం. సీతాకోకచిలుకలు, కందిరీగలు ఇవన్నీ కూడా విత్తనాలను కూడా భూమిపై చల్లి మరిన్ని మొక్కలు పుట్టేలా చేస్తాయి. కాబట్టి పువ్వులు అవసరమైనప్పుడు మాత్రమే కోయండి. అనవసరంగా పువ్వులను కోసి నేలపాలు చేయకండి.

Related News

Diwali 2024: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?

Vastu Shastra for Idols: ఇంట్లో ఈ 5 విగ్రహాలు ఉంచితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది !

Sunday Lucky Zodiac: రేపు గజకేసరి యోగం.. ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సూర్యుడి ఆశీస్సులు

Mars Transit 2024: ఈ 3 రాశుల వారు త్వరలో శుభవార్త వినబోతున్నారు

Diwali 2024: దీపావళి నాడు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టాన్ని పొందుతారు

Dhanteras 2024: ధంతేరస్‌లో అమ్మ వారికి ధనియాలు సమర్పిస్తే అదృష్టం వరిస్తుంది

Big Stories

×