EPAPER

Congress : మాది రైతు రాజ్యం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Congress : మాది రైతు రాజ్యం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతేనని, అందుకే కష్టకాలంలో కూడా 50 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాతే, పకడ్బందీగా రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్ బీఆర్కేఆర్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రైతు బీమా, రుణ మాఫీ, రైతు భరోసా, ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు కనీస మద్దతు ధర, ఇతర వ్యవసాయ అంశాలపై తుమ్మల క్లారిటీ ఇచ్చారు.


ALSO READ:జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

మాఫీ పూచీ మాదే –


బీఆర్ఎస్ పాలనలో ఖజానాను ఎడాపెడా దోచేశారని తెలిసినా, రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో రుణమాఫీ అమలుకు ధైర్యంగా ముందుకొచ్చి చేసి చూపారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్త రుణమాఫీ జరగగా, నేడు మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలోని మొత్తం 42 లక్షల కుటుంబాలను రుణవిముక్తులను చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి దశలవారీగానూ లక్ష రుణమాఫీ చేయలేకపోయిందని, ఆనాటి రైతులనూ ఆదుకొనేందుకే గత ఐదేళ్లలో తీసుకున్న రైతు రుణాలనూ తాము మాఫీ చేశామన్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న రైతులకు డిసెంబరు నాటికి మాఫీ చేస్తామని, రూ.2 లక్షలకు పైగా రుణాలుండి, నిర్ధారణ కాని రైతులకోసం త్వరలో షెడ్యూల్‌ ప్రకటించి తగిన విధంగా న్యాయం చేస్తామన్నారు.

సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే –

గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, బీడు భీములకూ రూ. 25 వేల కోట్లు రైతు బంధు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయని, అందుకే అలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా రైతుభరోసా పథకాన్ని అమలు చేయటానికి తమ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, ఆ కమిటీ రిపోర్టు రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తున్నామన్నారు. అలాగే, పంట బీమా పథకం వచ్చే సీజన్ నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కే అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నా, అందులో కేవలం 25 శాతాన్నే కేంద్రం తీసుకుంటోందని, దానిని పూర్తిగా కొనాలని తాము కేంద్రానికి లేఖ రాశామని తుమ్మల చెప్పారు. రుణమాఫీ గురించి ఆలోచన చేయని ప్రభుత్వాలు, అరకొర చేసిన పార్టీలు తప్పుగా మాట్లాడితే రైతులు వారిని క్షమించరని వ్యాఖ్యానించారు.

బాక్స్
మిల్లెట్స్ హబ్.. తెలంగాణ
చిరుధాన్యాల సాగు దిశగా తెలంగాణ రైతాంగం చొరవ చూపాలని వ్యవసాయమంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ పోషక చిరుధాన్యాల సమ్మేళనం (ఇంటర్నేషనల్ న్యూట్రిసెరిల్ కన్వెన్షన్) లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలను మళ్ళీ మన రోజువారీ ఆహారంలోకి తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థతో కలిసి, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తు, అవసరమైతే సబ్సిడీలు కూడా ఇవ్వడంతో పాటు, రైతులకు శిక్షణలు శిభిరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలను మిల్లెట్ ఆధారిత ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడంలో ప్రోత్సహించి, తెలంగాణను మిల్లెట్స్ హబ్‌గా మార్చుతామన్నారు.

Related News

Revanth Reddy book : ‘గురి తప్పని విలుకాడు’ సీఎం రేవంత్..

Minister ponguleti : నెలాఖరుకు ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి

Bandi Sudhakar : మూసీపై గోబెల్స్ ప్రచారమా? – బండి సుధాకర్ గౌడ్

Cm Revanth Reddy : బాధితులకు న్యాయం జరిగితేనే పోలీసులపై నమ్మకం నిలబడుతుంది : పోలీస్ డ్యూటీ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Nalgonda water issue : నల్గొండంటే అంత కళ్లమంటా? – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

CM Revanth on Group 1: విపక్షాల ట్రాప్ లో పడొద్దు.. ఒక్క లాఠీ దెబ్బ పడకూడదు.. కేసులు కూడా నమోదు చేయవద్దు.. సీఎం రేవంత్

Big Stories

×