EPAPER

Smartphone sales : ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

Smartphone sales : ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

Smartphones sales : స్మార్ట్ ఫోన్.. ఈ అరచేతిలో ఇమిడిపోయే బుజ్జి యంత్రం ఒక్క క్షణం కనిపించకపోతే ఎవరికి ఏ పని తోచదు. చేసే ప్రతి పనిలో నేనున్నా అంటూ మనిషి జీవితంలో భాగమై పోయిన స్మార్ట్ ఫోన్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువతతో పాటు అన్ని వయసుల వారు స్మార్ట్ ఫోన్ కు బానిసలే. ఇక ప్రపంచ వ్యాప్తంగా వీటిని కొనేవారు సంఖ్య సైతం అదే స్థాయిలో ఉండటంతో టాప్ బ్రాండ్ కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. ఇక భారత్లో సైతం స్మార్ట్ ఫోన్స్ ఉన్న డిమాండ్ తక్కువ ఏమి కాదు. ఇక గత కొన్నాళ్లలో భారతీయుల సైతం స్మార్ట్ ఫోన్స్ ఎగబడి కొన్నారు అన్నమాట నిజమే అనిపిస్తుంది కొన్ని లెక్కలు చూస్తుంటే.


ALSO READ:లంగా మాటలు.. దొంగ నాటకాలు.. మానుకోండి.. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ హెచ్చరిక

ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఫెస్టివల్ సేల్స్ తో పాటు ఎప్పటికప్పుడు కొత్త సేల్స్ తీసుకువస్తూనే ఉన్నాయి. ఇక ఈ సేల్స్ లో స్మార్ట్ ఫోన్స్ తో పాటు గ్యాడ్జెట్స్ పై భారీ స్థాయిలో డిస్కౌంట్ ఉండటంతో ఎగబడి కొంటున్నారు గ్యాడ్జెట్ ప్రియులు. ఇక తాజాగా కనాలిస్ రీసెట్ సంస్థ స్మార్ట్ ఫోన్స్ కు ఉన్న డిమాండ్ పై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలతో పాటు మరెన్నో విషయాలు బయటపడ్డాయి.


ఈ ఏడాది విడుదలైన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ మంచి డిమాండ్ కనిపించిందని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అత్యధిక అభివృద్ధి కనిపించిందని.. మొత్తంగా 47 మిలియన్ మంది స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేశారని వివరించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ లో వివో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది.

వివో కంపెనీ నుంచి విడుదలైన స్మార్ట్ ఫోన్స్ ను అత్యధికంగా కొన్నారని తెలిపిన ఈ సంస్థ.. ఇక రెండో స్థానంలో షియోమీ ఉందని.. మూడో స్థానంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్ నిలిచిందని చెప్పుకొచ్చింది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఒప్పో ఉండగా.. ఐదో స్థానంలో రియల్ మి ఉన్నాయి. ఇక తర్వాత స్థానాల్లో మిగిలి ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్ని నిలిచాయి అని చెప్పుకొచ్చింది.

ఇక స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయడంలో ఆన్లైన్ స్టోర్స్ ముందున్నాయని తెలిపిన ఈ సర్వే.. ఆఫ్ లైన్ స్టోర్స్ లో సైతం ఎక్కువగానే స్మార్ట్ ఫోన్స్ అమ్ముడు అయిపోయాయని చెప్పుకొచ్చింది. ఎక్కువ మంది మిడ్ రేంజ్ మొబైల్స్ నే కొనుగోలు చేశారని.. చిన్న నగరాల నుంచి ఎక్కువగా డిమాండ్ కనిపించిందని తెలిపింది. ఐఫోన్ 15 సిరీస్ విడుదలైన తర్వాత చిన్న నగరాల నుంచే ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపిన ఈ సంస్థ.. నథింగ్ స్మార్ట్ ఫోన్స్, మోటోరోలా సైతం తనదైన శైలిలో సత్తా చాటాయని అని తెలిపింది.

Related News

Techno Phantom V fold 2 5G : టెక్నో మరో సంచలనం.. హై స్టాండర్డ్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంఛ్

Oneplus offline sales : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​

Instagram : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

YouTube Account Recovery : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

Big Stories

×