EPAPER

Techno Phantom V fold 2 5G : టెక్నో మరో సంచలనం.. హై స్టాండర్డ్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంఛ్

Techno Phantom V fold 2 5G : టెక్నో మరో సంచలనం.. హై స్టాండర్డ్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంఛ్

Techno Phantom V fold 2 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత్ లో మరో కొత్త పోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. టెక్నో Phantom V fold 2 5G మొబైల్ ను త్వరలోనే భారత్ లో ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.


మొబైల్స్ లో ఫోల్డబుల్ మోడల్స్ కు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొనుగోల సైతం భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పోల్డబుల్ మొబైల్స్ ను అధిక స్థాయిలో కొనటంతో.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ తమ స్టాండర్డ్స్ కు అనుగుణంగా కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో Techno Phantom V fold 2 5G స్మార్ట్ ఫోన్ అదిరిపోయే ఫీచర్స్ తో ఇండియాలో లాంఛ్ చేసింది.  టెక్నో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు స్పెషల్ స్పెసిఫికేషన్స్ తో తీసుకువస్తుంది. మీడియా టెక్ డైమన్ సిటీ చిప్ సెట్,  అమ్లోడ్ డిస్ప్లే 50 మెగా పిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్టు తెలిపింది. ఇక ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఈ ఫోన్ టీజర్ ను రిలీజ్ చేసి స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పేసింది.

ALSO READ : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఈ ఫోన్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. భారతీయ మార్కెట్లో ధరను మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. గ్లోబల్ వేరియంట్ 1080 x 2550 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్ తో ఔటర్ 6.42 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో రాబోతుంది.

స్క్రీన్ – 7.85 అంగుళాల 2K+ అమోలెడ్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు లోపల వైపు 2K+ బూస్ట్ అమోలెడ్ రిజల్యూషన్‌ ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్‌తో 12GB RAM + 512GB అంతర్గత స్టోరేజ్ తో డిజైన్ చేశారు.

కెమెరా – ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా క్వాలిటీ హై రేంజ్ లో ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ తో పాటు 50 మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం స్పెషల్ గా డ్యూయల్ 32 మెగా పిక్సెల్ కెమెరాను ఈ స్మార్ట్ ఫోన్ లో డిజైన్ చేశారు.

బ్యాటరీ – 5750mAh బ్యాటరీను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 70W అల్ట్రా ఛార్జ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యం ఉంది.

కనెక్టివిటీ కోసం స్పెషల్ గా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్, ఇ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్ వంటి హై స్టాండర్స్ సెన్సార్స్ సైతం ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.

Related News

Smartphone sales : ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

Oneplus offline sales : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​

Instagram : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

YouTube Account Recovery : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

Big Stories

×