EPAPER

Wild Animals Attacking Humans: జనావాసాల మీద దాడులు చేస్తున్న వన్యమృగాలు.. కారణాలు ఇవేనా?..

Wild Animals Attacking Humans: జనావాసాల మీద దాడులు చేస్తున్న వన్యమృగాలు.. కారణాలు ఇవేనా?..

Wild Animals Attacking Humans| ఒక చిన్న గ్రామం చుట్టూ దట్టమైన అడవి, పంటపొలాలున్నాయి. వందల సంవత్సరాలుగా గ్రామస్తులు ఆ పర్యావరణంలో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఒకరోజు రాత్రి గ్రామస్తులు నిద్రపోతుండగా.. గ్రామ పరిసరాల్లోకి ఒక తోడేళ్ల మంద వచ్చింది. ఇంతలో నిద్రపోతున్న గ్రామస్తులకు మేకలు, గొర్రెల శబ్దాలు వినిపించాయి. అవన్నీ గట్టిగా కేకలు వేస్తున్నాయి.


ఆ శబ్దాలు విని గ్రామస్తులు మేకలున్న ప్రదేశానికి వెళ్లి చూడగా.. కొన్ని తోడేళ్లు మేకలను చంపుకుతింటున్నాయి. వాటిని తరిమికొట్టడానికి గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. కానీ ఆ తోడేళ్లు తిరిగి మనుషులపై దాడి చేశాయి. ఈ ఘటనలో కొంత మందికి గాయాలయ్యాయి. చివరికి ఆ తోడేళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. నాలుగు నెలల క్రితం కూడా ఒక రైతు ఇంటి వద్ద రాత్రిపూట తోడేళ్లు దాడి చేసి కొన్ని మేకలను చంపుకుతిన్నాయి.

మరో ఘటనలో ఒక నాలుగేళ్ల పాప సంధ్య ఇంటి బయట నిద్రిస్తుండగా కొన్ని తోడేళ్లు దాడి చేసి పాపను అక్కడి నుంచి తీసుకెళ్లాయి. మరుసటి రోజు గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలో పాప శవం అడవిలో లభించింది. ఇంకొక ఘటనలో ఒక 8 ఏళ్ల బాలుడు తన తల్లి పక్కనే ఇంటి బయట నిద్రపోతుండా తోడేలు దాడి చేసింది. ఇలా కేవలం నాలుగు నెలల్లో 9 మంది పిల్లలు, ఒక 45 ఏళ్ల మహిళను తోడేళ్లు అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపుకుతిన్నాయి.


ఇలాంటి ఘటనలు గత కొంత కాలంగా ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 26 మంది చనిపోయారని సమాచారం. మరోవైపు ఉత్తరాఖండ్ లో ఒక 55 ఏళ్ల రైతు పొలాల్లో పనిచేసుకుంటుండగా.. ఒక ఏనుగు అనుకోకుండా అక్కడికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఏనుగులు సంచరించడం సాధారణ విషయమే కానీ.. పొలాల్లో, జనావాసాల సమీపంలోకి వన్యమృగాలు రావడం అరుదు. దీంతో ఆ రైతు ఆ చిన్న ఏనుగు వద్దకు చేరి దాన్ని అక్కడి నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. ఏనుగు కోపం గమనించిన ఆ రైతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగులు తీశాడు.

ఇలా వన్యప్రాణులు జనావాసాల మీద దాడులు చేయడం పట్ల గ్రామస్తులు సమావేశమయ్యారు. ఇన్నేళ్లుగా లేనిది ఇలా వన్య మృగాలు ఎందుకు దాడి చేయడానికి కారణాలు ఏంటని? చర్చించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని అడిగారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ కేరళ గ్రామాల్లో కూడా జరుగుతున్నట్లు వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే వన్యప్రాణులు ఎందుకు మనుషులు నివసించే ప్రాంతాల వైపు వస్తున్నాయనే కొన్ని కారణాలున్నాయి.

Also Read: 7 పులులు, 14 చిరుత పులులు, 1 ఎలుగుబంటి మృతి.. ‘అంతా రైల్వే శాఖ తప్పిదమే’

వ్యవసాయం, రైల్వే ప్రాజెక్టుల కోసం అడవులను నరికివేయడం
మనుషుల సంఖ్య పెరిగే కొద్ది వ్యవసాయం, పట్టాణాభివృద్ధి కోసం చెట్లు, అడవులు నరికివేయడం జరుగుతుంది. దీంతో అప్పటివరకు ఆ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులు తమ నివాసం కోల్పోవాల్సి వస్తుంది.

అడవులలో ఆహార కొరత
పులులు, తోడేళ్లు లాంటి మాంసాహార జంతువులకు సరిపడ ఆహారం అడవిలో లభించనప్పుడు అవి సమీపంలోని ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాలలో మేకలు, గొర్రెలు, ఆవులు లాంటి జంతువులను తినేందుకు వస్తాయి. వ్యవసాయం కోసం రైతులు ఆవులు, బర్రెలు, మేకలను పెంచుతూ ఉంటారు. ఈ సాధు జంతువుల వాసనను ఈ మృగాలు పసిగట్టి గ్రామాల మీద దాడి చేస్తాయి.

నీటి కొరత
కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అడవిలో నదీజలాలు ఎండిపోవడంతో తోడేళ్లు మనషులు నివసించే ప్రాంతంలో నీటి కోసం వస్తాయి.

పర్యాటకులతో భయం
అడవిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు.. అక్కడ పర్యటించడానికి వచ్చిన మనుషులను చూసి భయపడతాయి. తమ నివాసాలను మనుషులు ఆక్రమించుకుంటున్నారనే భయంతో కొన్ని సందర్భాలలో అవి ఎదురుదాడి చేస్తాయి. చాలాసార్లు మనుషులు వన్యమృగాలను వేటాడడానికి అడవిలో వెళ్లినప్పుడు మృగాలు తిరిగి జనావాసాల మీద దాడి చేయడం జరిగింది. మేకలు, ఆవులను అడవిలో గడ్డి మేపడానికి రైతులు తీసుకెళ్లినప్పుడు ఏనుగులు, తోడేళ్లు లాంటి మృగాలు ఇవి గమనించి తమ ప్రదేశాల్లో మనుషులు సంచరించడం ఇష్టపడవు.

అందుకే వన్యమృగాల ప్రమాదం నివారించడానికి అటవీ శాఖ అధికారులు కొన్ని జాగ్రత్తలు సూచించారు.

గొర్రెలు, మేకలు, ఆవులు లాంటి పెంపుడు జంతువులు రక్షణ కోసం వాటి గొడ్ల చుట్టూ ఫెన్సింగ్ చేయడం.

వన్యమృగాలు సంచరించే ప్రదేశంలో మనుషులు అనవసరంగా వెళ్లకూడదు.

గ్రామస్తులు తమ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద ముళ్లతో ఫెన్సింగ్ చేసి.. ఏనుగులు లాంటి జంతువులు సమీపించినప్పుడు ఏదైనా శబ్దాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం.

వీలైనంత వరకు చెట్లను నరికివేయకుండా, గ్రామం చుట్టూ చెట్లు పెంచడం చేయాలి.

ఏనుగులు పొలాల్లో రాకుండా ఉండేందుకు ఏనుగులు తినడానికి ఇష్టపడని పంటలు వేయాలి.

అన్నింటి కంటే ముఖ్యంగా అడవులను, వన్యప్రాణులను గౌరవించాలని పిల్లలకు నేర్పించాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

CM Chandrababu: త్యాగాలు చేసిన వీళ్లకి.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా?

YS Jagan Vs YS Sharmila: నీకు చోటు లేదు.. జగన్‌కి షర్మిల ఝలక్

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Israel–Hamas war: ఇజ్రాయెల్ చేతిలో హమాస్ లీడర్లు.. వీళ్లందర్నీ ఎలా హతమార్చింది?

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

Big Stories

×