EPAPER

Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదా? మొద్దు నిద్రను వీడడం లేదా? సీఎం చంద్రబాబు బాటలో మంత్రి లోకేష్ నడుస్తున్నారా? మునుపటి పాలనను చూస్తారని సీఎం చంద్రబాబు ఎందుకున్నారు? దాన్ని అక్షరాలా మంత్రి నారా లోకేష్ చేసి చూపిస్తున్నారా అవుననే సమాధానం వస్తోంది.


రెండురోజుల కిందట విశాఖ వెళ్లారు మంత్రి నారా లోకేష్. కోర్టు వ్యవహారం తర్వాత శనివారం ఉదయం తన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ద్వారకా నగర్‌లో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి వెళ్లారు. నార్మల్‌గా అయితే ఉదయం ఎనిమిది గంటలకు తెరవాల్సిన గ్రంథాలయం మూసి ఉంది. కాసేపు అక్కడే నిలబడిపోయారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడారు.

ALSO READ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన


9.45 గంటలకు వచ్చిన అధికారులు గ్రంథాలయాన్ని ఓపెన్ చేశారు. దీనిపై మంత్రి కాసింత అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

పనిలో పనిగా నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. అంగన్వాడీ బాలల కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో కలిసి ఫోటోలు దిగారు. చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై సిబ్బంది నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

 

Related News

CM Chandrababu: అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం, మునిగింది అమరావతి కాదు.. యలహంక

ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు

Nara Lokesh: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

TDP Targets Jagan: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

Big Stories

×