EPAPER

Miyapur Chirutha Puli: మియాపూర్‌లో కనిపించింది చిరుత కాదా? మరేంటి? అధికారులు ఏమంటున్నారు? అయినా బీ అలర్ట్!

Miyapur Chirutha Puli: మియాపూర్‌లో కనిపించింది చిరుత కాదా? మరేంటి? అధికారులు ఏమంటున్నారు? అయినా బీ అలర్ట్!

Miyapur Chirutha Puli: మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కనిపించిన చిరుత ఎక్కడ? పోలీసులు దాని ఆచూకీ కనుకున్నారా? లేదా? హైదరాబాద్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇది. నిన్న రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్‌(Miyapur Metro Station) వెనుక నిర్మాణంలో బిల్డింగ్ లో పని చేస్తున్న కార్మికులు చిరుత(Tigar)ను చూశారు. సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. కానీ.. చిరుత ఆచూకీ కనిపించలేదు. కానీ.. ఆ వీడియోలు మాత్రం క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ మహానగరంలోకి చిరుత ఎక్కడ నుంచి, ఎలా వచ్చింది అనే అంశాన్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.


అయితే.. మెట్రో స్టేషన్‌ వెనక 200 ఎకరాల మేర ఖాళీ స్థలం, అడవి ఉంది. అందులో నుంచే చిరుత వచ్చి ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఇది చిరుత కాదని.. అడవి పిల్లి అయ్యి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరికైనా చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి జాడ గుర్తించాలని నిర్ణయించారు. స్థానికులు మాత్రం క్షణక్షణం భయాందోళనలో ఉన్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనే దాని కంటే ఎక్కడి వెళ్లిందనేది అనేది వింతగా మారింది. అది మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందా? లేకపోతే జనావాసాల్లోనే తిరుగుతుందా? అని భయాందోళన నెలకొంది.

Also Read: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!


హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్(Miyapur Metro Station) సమీపంలో చిరుత పులి సంచరించినట్లు ఓ వీడియో వైరల్‌గా మారిన తరుణంలో.. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్‌లో సంచరించింది చిరుత పులి(Chirutha Puli) కాదని.. అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

నిన్నటి నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు ఆ జంతువు కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అది సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. ఫైనల్ గా పగ్‌ మార్క్స్ ఆధారంగా అది పులి కాదు.. పిల్లి అని తేల్చారు. ఇక్కడ తిరిగిన జంతువు పాదముద్రలు 3.5 సెంటీమీటర్లు ఉన్నాయని శంషాబాద్ DFO విజయానంద్‌రావు తెలిపారు. చిరుత పాదముద్రలు కనీసం 7 సెంటిమీటర్లు ఉంటాయంటున్న విజయానంద్ రావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్.

Related News

CM Revanth Reddy: దొంగ నాటకాలు.. మానుకోండి.. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ హెచ్చరిక

Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!

BRS leader ship change: అయ్యా గమ్మునుండు, నేను చూసుకుంటా.. ఆ సంకేతాలు దేనికి?

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Big Stories

×