EPAPER

Henna: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?

Henna: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?

Henna For Hair: అకేషన్ ఏదైనా ప్రస్తుతం చాలా మంది జుట్టుకు హెన్నా పెట్టుకోవడం కామన్ అయిపోయింది. తరచుగా హెన్నాను జుట్టుపై అప్లై చేసే వారు చాలా మందే ఉన్నారు. జుట్టు మృదువుగా, మెరిసేలా చేయడానికి హెన్నా బాగా ఉపయోగపడుతుంది. మరి జుట్టుకు హెన్నాను ఏ విధంగా అప్లై చేయాలి ? హెన్నాలో ఎలాంటి పదార్థాలను కలపాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


తెల్ల జుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెన్నాను అప్లై చేస్తుంటారు. మహిళలు తరచుగా ప్రత్యేక సందర్భాలలో హెన్నాను జుట్టుకు అప్లై చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మహిళలు హెన్నాను అప్లై చేయించుకోవడానికి పార్లర్‌లకు వెళతారు. కానీ పార్లర్‌కు వెళ్లకుండానే మీరు ఇంట్లో హెన్నాను అప్లై చేస్తున్నట్లయితే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.

హెన్నాను అప్లై చేయడం అనేది జుట్టుకు సహజమైన రంగును అందించడం. ఇది జుట్టును బలంగా చేసే పురాతన మార్గం కూడా. ఇది జుట్టు రంగును మార్చడమే కాకుండా పోషణను అందిస్తుంది.


జుట్టుకు హెన్నాను ఎలా అప్లై చేయాలి ?

కావలసినవి: 
హెన్నా పొడి – 1 చిన్న కప్పు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 3 టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి (ఇష్టమైతే)- 1 టీ స్పూన్
షికాకాయ్ పొడి (ఇష్టమైతే)- 1 టీ స్పూన్
బ్రష్
పాత టవల్

హెన్నాను అప్లై చేసే విధానం: 
మెహందీ పేస్ట్‌ను సిద్ధం చేయండి: హెన్నా పొడిని ఒక పాత్రలో తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు వేసి కలపాలి. మందపాటి పేస్ట్ చేయడానికి ఈ హెన్నాలో కాస్త నీరు కలపండి. కావాలంటే ఉసిరి పొడి, శీకాకాయ పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ రాత్రంతా అలాగే ఉంచండి.

జుట్టును సిద్ధం చేయండి: తర్వాతి రోజు తలస్నానం చేసి జుట్టును కడిగి ఆరబెట్టండి. తర్వాత జుట్టు చివర్లలో కొద్దిగా నూనె రాయండి.

హెన్నాను అప్లై చేయండి: బ్రష్ సహాయంతో హెన్నా పేస్ట్ ను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు రాయండి. హెన్నాను వెంట్రుకలపై పూర్తిగా అప్లై చేయండి. హెన్నాను అప్లై చేసిన తర్వాత షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ షీట్ తో జుట్టును కవర్ చేయాలి.

జుట్టు కడగడం:హెన్నాను పూర్తిగా ఆరనివ్వండి. దీని తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. హెన్నా జుట్టుకు అప్లై చేసిన తర్వాత షాంపూ వాడకూడదు.

కండీషనర్ అప్లై చేయండి: జుట్టును మృదువుగా చేయడానికి పెరుగు లేదా అలోవెరా జెల్ వంటి సహజమైన కండీషనర్‌ను అప్లై చేయండి.

Also Read: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

కొన్ని అదనపు చిట్కాలు: 
రంగు: హెన్నా రంగు మీ జుట్టు యొక్క సహజ రంగుపై ఆధారపడి ఉంటుంది.
సమయం: హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే, అంత ముదురు రంగులో జుట్టు ఉంటుంది.
సూర్యకాంతి: హెన్నాను అప్లై చేసిన తర్వాత సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఇతర పదార్థాలు: మీరు పసుపు, కాఫీ లేదా టీ వంటి ఇతర సహజ పదార్ధాలను కూడా హెన్నాలో జోడించవచ్చు.

హెన్నా యొక్క ప్రయోజనాలు:
జుట్టుకు సహజ రంగును ఇస్తుంది.
జుట్టును బలంగా చేస్తుంది.
చుండ్రును తగ్గిస్తుంది.
జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
చుండ్రు నుండి జుట్టును రక్షిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Kiwi Fruit: ఈ ఫ్రూట్‌ విటమిన్ సి యొక్క పవర్ హౌజ్.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

Beetroot for Intercourse: బీట్ రూట్ తినండి బాబాయ్‌లూ.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Home Remedies For Hair: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

Big Stories

×