EPAPER

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

విశాఖ, శ్రీకాళం జిల్లాలకే పరిమితం చేసిన జగన్

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్(YS Jagan) రాష్ట్రవ్యాప్తంగా వైసిపిలో సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అనేక ఉమ్మడి జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని మరోసారి ప్రకటించారు. రెండు జిల్లాలకు మధ్యలో ఉన్న విజయనగరాన్ని పక్కన పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు 2016 నుండి వైసీపీ అధికారం చేపట్టిన రెండున్నర ఏళ్ల వరకు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డిఫై భూ కబ్జా సహా తీవ్ర ఆక్రమణలు రావడంతో ఆయన్ని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని తెరమీదకి తెచ్చింది వైసిపి.. 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. వైసిపికి కోలుకోలేని పరాభవం ఎదురైంది. దాంతో పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డ జగన్ విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని మళ్లీ తెరమీదకి తీసుకొచ్చారు.


వైసిపి ప్రారంభ నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు. విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయసాయిరెడ్డి(Vijay Sai Reddy) గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్న, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం.

ఆ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుండి విజయసాయి రడ్డిపై జగన్ కు భారీగా ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి హవాను తగ్గించదానికి రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి ఆయన్ని తప్పించి వై వి సుబ్బారెడ్డిని నియమించారు. అయితే వైవీ హయాంలో ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడం.. ఉత్తరాంధ్ర మొత్తంలో కేవలం రెండు ఎమ్మెల్యేలు. ఒక ఎంపీ సీటు మాత్రమే గెలవడంతో డైలమాలో పడ్డ జగన్ మళ్లీ కో ఆర్డినేటర్‌ని మార్చారు.

Also Read: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

మధ్యలో విజయనగరానికి మరొకరన్ని నియమిస్తారా?

ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించిన జగన్ మధ్యలో ఉన్న విజయనగరం జిల్లా బాధ్యతలు మాత్రం ఆయనకు కట్టపెట్టలేదు. విజయనగరం జిల్లా సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించిన జగన్ విజయనగరం జిల్లాకు మాత్రం ఎవర్ని నియమించలేదు. విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ తర్వాత వైసీపీలో అత్యంత బలమైన వ్యక్తి బొత్స మేనల్లుడు చిన్న శీను.. 2024 ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటు ఆశించిన చిన్న శీనుకు అది దక్కలేదు. మేనల్లుడితో విభేదాల కారణంగా బొత్సనే ఆయనకి సీటు దక్కకుండా చేశారన్న ప్రచారం ఉంది.

ఇప్పుడు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)ను గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా పంపించడంతో.. విజయనగరం జిల్లాకు చిన్న శీనును రీజనల్ కోఆర్డినేటర్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీపై పట్టు సాధించాలనే ఆలోచనలో ఉన్న విజయసాయిరెడ్డి మధ్యలో ఉన్న విజయనగరాన్ని వదిలేసి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఎలా వ్యవహరిస్తారు, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన నాయకులను ఎలా సమన్వయ పరుస్తారు అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. దానికి తోడు విజయనగరం జిల్లాకు వేరే వ్యక్తిని రీజినల్ కోఆర్డినేటర్ గా నియమిస్తే గతంలో పెత్తనం చేసినట్లు ఈ సారి విజయసాయిరెడ్డి పప్పులు ఉడకవంటున్నారు.

సాయిరెడ్డి నియామకాన్ని జీర్ణించుకోలేక పోతున్న నేతలు

శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా ఉన్న ధర్మాన బ్రదర్స్ ని కాదని రెండున్నర ఏళ్లుగా ఉత్తరాంధ్ర రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డిని తిరిగి ఆర్డినేటర్‌గా నియమించడాన్ని జిల్లా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారంట. సాయిరెడ్డిపై ఉన్న ఆరోపణలు, ఆయన వ్యవహారతీరు నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన నాయకులు ఆయనకు ఏమాత్రం సహకరిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. గతంతో పార్టీ నేతలందర్నీ పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా తన కనుసన్నల్లో నడిపించిన సాయిరెడ్డికి ఈ సారి అలా నడిపించడం కత్తిమీద సామే అంటున్నారు.

మరోవైపు విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఈమర కూతురుకి సంబంధించి భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయ్ సాయి రెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా? అనే చర్చ జరుగుతుంది. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఏర్పడిందని సంబంధాలపై ఆరోపణలు వచ్చాయి. అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరుగుతుంది.

Related News

Wild Animals Attacking Humans: జనావాసాల మీద దాడులు చేస్తున్న వన్యమృగాలు.. కారణాలు ఇవేనా?..

YS Jagan Vs YS Sharmila: నీకు చోటు లేదు.. జగన్‌కి షర్మిల ఝలక్

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Israel–Hamas war: ఇజ్రాయెల్ చేతిలో హమాస్ లీడర్లు.. వీళ్లందర్నీ ఎలా హతమార్చింది?

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

IRCTC New Ticket Rules: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

Big Stories

×