EPAPER

IND vs NZ: విరాట్ కోహ్లీ మరో రికార్డు…9000 టెస్ట్ పరుగులు క్రాస్ !

IND vs NZ: విరాట్ కోహ్లీ మరో రికార్డు…9000 టెస్ట్ పరుగులు క్రాస్ !

IND vs NZ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)… టెస్టుల్లో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ… న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్లో గాడిలో పడినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి రాణించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ.. 70 పరుగులు చేయడంతో ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.


విరాట్ కోహ్లీ సింగిల్ తీసిన కూడా కొత్త రికార్డులు నమోదు అవుతాయి అన్న సంగతి తెలిసిందే. అలాంటిది చాలా రోజుల తర్వాత 70 పరుగులు టెస్టుల్లో చేశాడు కోహ్లీ. దీంతో తన టెస్ట్ కెరీర్ లో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో 9000 పరుగులు దాటిన… నాలుగో ప్లేయర్గా రికార్డు లోకి ఎక్కాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.

సచిన్ టెండూల్కర్ తర్వాత రాహుల్ ద్రావిడ్.. రెండవ స్థానంలో ఉన్నాడు. టెస్ట్ కెరీర్ లో 13265 పరుగులు చేశాడు రాహుల్ ద్రావిడ్. అలాగే మూడవ స్థానంలో సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు పదివేల 122 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు క్రికెటర్లు రిటైర్ అయ్యారు. కాబట్టి… ఈ ముగ్గురి రికార్డును బ్రేక్ చేసే అవకాశం విరాట్ కోహ్లీ కి మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 197 ఇన్నింగ్స్ లు ఆడి.. విరాట్ కోహ్లీ 9000 పరుగుల మార్కును దాటాడు.


Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

అయితే సచిన్ టెండూల్కర్ మార్కును బ్రేక్ చేయాలంటే… కోహ్లీ కనీసం 50 నుంచి 100 టెస్ట్ లు వాడాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్ గా… ప్రపంచవ్యాప్తంగా 9000 పరుగులు చేసిన క్రికెటర్లలో 18వ స్థానాన్ని సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో… మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన విరాట్ కోహ్లీ…. రెండవ ఇన్నింగ్స్ లో కాస్త టచ్ లోకి వచ్చాడు. ఏకంగా 70 పరుగులు చేసి చివరి బంతికి.. అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.

 

ఇది ఇలా ఉండగా…. బెంగళూరు వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ ( new zealand) వర్సెస్ టీమిండియా (Team inida) మధ్య టెస్ట్ మ్యాచ్లో… ఇప్పటికే మూడు రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు అయితే న్యూజిలాండ్ దే పై చేయిగా కనిపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు ఆల్ అవుట్ అయిన టీమిండియా… న్యూజిలాండ్ ను మాత్రం కట్టడి చేయలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో… ఏకంగా 402 పరుగులు చేశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా… కాస్త దాటిగానే ఆడుతోంది.మూడవరోజు మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. మరో 125 పరుగులు చేస్తే… టీమిండియా లీడ్ లోకి వస్తుంది. ఇక టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లో… యశస్వి జైస్వాల్ 35 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 52 పరుగులకు వికెట్ పోగొట్టుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లీ 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఇప్పటికే 70 పరుగులు చేసుకోవడం జరిగింది.

Related News

Champions Trophy 2025: బీసీసీఐకి పాకిస్తాన్ సంచలన లేఖ.. చాంపియన్స్ ట్రోఫీ పై టీమిండియాకు బంపర్ ఆఫర్?

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట..రాణించిన కోహ్లీ , సర్ఫరాజ్

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

Big Stories

×