EPAPER

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

Most Bizarre Train Laws: ఆహ్లాదకరమైన ప్రయాణాలను కోరుకునే వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. చక్కటి సౌకర్యాలు, ప్రకృతి అందాలను చూస్తూ ముందుకుసాగుతారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణీలకులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, కొన్ని దేశాల్లోని రైల్వే చట్టాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..


ఇంగ్లాండ్ లో రైల్వే స్టేషన్ లో ముద్దు నిషేధం

2009 నుంచి ఇంగ్లాండ్ లో ఈ నిబంధన అమలు అవుతుంది. తొలిసారి వారింగ్‌టన్‌లోని వారింగ్‌టన్ బ్యాంక్ క్వే రైల్వే స్టేషన్ లో ఈ విధానాన్ని అమలు చేశారు. ముద్దుల కారణంగా ప్రయాణీకులు త్వరగా జర్నీలు చేయడం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఫ్రెంచ్ రైలు ప్లాట్‌ ఫారమ్‌ పై నో కిస్సింగ్   

ఫ్రాన్స్‌  ప్రభుత్వం రైలు ప్లాట్‌ఫారమ్‌ లపై ముద్దు పెట్టుకోవడాన్ని నిషేధించింది. ఈ చట్టం 1910 నుంచి అమల్లో ఉంది. అయితే, రైలు స్టేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలస్యాన్ని నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

వియన్నా రైళ్లలో ముద్దులు నిషేధం

ముద్దుల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో  2013 నుంచి వియన్నా రైళ్లలో ముద్దులను నిషేధించారు. ఒకవేళ అతిక్రమిస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సింగపూర్ రైళ్లలో పండ్లకు నో పర్మీషన్   

సింగపూర్ రైళ్లలో డ్యూరియన్ పండ్లను తీసుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండ్లు అత్యంత దుర్వాసనను కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుళ్లిన కోడిగుడ్డు, మురుగు వాసనను కలిగి ఉంటుంది. ఈ పండ్ల వల్ల ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదని అధికారులు నిషేధం విధించారు.

అలబామాలో రైలు పట్టాలపై ఉప్పు చల్లితే ఉరిశిక్ష   

అలబామాలో రైల్‌ ట్రాక్‌లపై ఉప్పు చల్లితే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. భారీ జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. ఉప్పు ట్రాక్ ల మీద చల్లడం వల్ల పట్టాలు తుప్పుపట్టి ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.

విస్కాన్సిన్ రైళ్లలో అసభ్యకర భాష బ్యాన్

విస్కాన్సిన్ లో అసభ్యకర భాష ఉపయోగించడంతో పాటు దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వెంటనే అరెస్టు చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద శిక్ష వేస్తారు. రైల్లో ఎప్పుడూ మర్యాద పాటించాల్సి ఉంటుందని అక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also:బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

సీటెల్‌లో ఒడిలో కూర్చోవడం నేరం

సీటెల్‌లో రైలు ప్రయాణం సందర్భంగా ఓ స్త్రీ పురుషుడి ఒడిలో కూర్చోవాలంటే ఇద్దరి మధ్యన దిండు ఉండాలి. దిండు లేకపోతే ఆరు నెలల వరకు శిక్ష విధిస్తారు. అయితే, స్త్రీలు, పురుషులు ఒకరి మీద ఒకరు కూర్చోడం ఎలాంటి నేరం కాదు.

Read Also: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

Related News

IRCTC New Ticket Rules: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

Big Stories

×