Chirutha hulchul in Miyapur hyderabad: హైదరాబాద్లో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలో చిరుత సంచరిస్తుందని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కొంతమంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరికొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఓ చిరుత సంచారం చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో ఏమైనా చిరుత ఆనవాళ్లు ఉన్నాయోనని ప్రయత్నిస్తున్నారు. అసలు చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
మియాపూర్లో చిరుత సంచారం
స్థానిక మెట్రో స్టేషన్ వెనుక సంచరిస్తున్న చిరుత
స్థానికుల సమాచారంతో చిరుత కోసం గాలిస్తున్న పోలీసులు@HarithaHaram @TSFDCL#Miyapur #leopard #Bigtv pic.twitter.com/fqCN1ftYDx
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2024