EPAPER

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళనాడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా పరిచయం రజనీకాంత్. రజనీకాంత్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన, సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. రజనీకాంత్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. ఆ స్టైల్,ఆటిట్యూడ్, ఆ స్వాగ్ ను మ్యాచ్ చేయటం తేలికని విషయం కాదు. ఇకపోతే ఒకప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుందేనంటే విపరీతమైన క్రేజీ ఉండేది. రీసెంట్ లో తెలుగులో ఆక్రేజ్ కొంతమేరకు తగ్గింది అని చెప్పాలి. దీని కారణం తమిళ దర్శకులు టైటిల్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం. తెలుగులో సినిమాలను సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం ఇలా చాలా విషయాలు జరుగుతుంటాయి.


తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ని సినిమాలను చూస్తూ ఉంటారు. తనకు ఏదైనా సినిమా నచ్చితే అది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఆ సినిమా గురించి తనకు అనిపించిన ఒపీనియన్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తే పదిమందికి ఆ సినిమాను సజెస్ట్ చేస్తారు. అలానే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చాలా సినిమాలు గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఒక అద్భుతమైన సినిమా తను చూసి నచ్చినపుడు ఆ చిత్ర యూనిట్ ని పిలిపించి సన్మానం చేసిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది తన అభిమానులకు తనతో సినిమా చేసే అవకాశం కూడా ఇచ్చాడు రజనీకాంత్. రజనీకాంత్ అభిమానులలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఒకరు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుభ్రత పెట్ట అనే సినిమాని చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ లో అనిపించింది.

ఇక పెట్ట సినిమా జరుగుతున్న సమయంలోనే కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ టు, మహాన్ సినిమాలను చెప్పాడట. అయితే కేవలం లైన్స్ మాత్రమే చెప్పాడు కానీ పూర్తి కథను రజనీకాంత్ కి చెప్పలేదు కార్తీక్ సుబ్బరాజు. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ చూసి ఆ కథలను తనకు పూర్తిగా ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ సుబ్బరాజుని క్వశ్చన్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కార్తీక్ సుబ్బరాజు లాంటి ఫిలిం మేకర్స్ అరుదుగా ఉంటారని చెప్పాలి. టెక్నికల్ గా సినిమాని నెక్స్ట్ లెవెల్ లో ఉంచుతాడు కార్తీక్. అలానే చాలామంది యంగ్ టాలెంట్ కూడా కార్తీక్ సుబ్బరాజ్ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వారిలో లోకేష్ కనకరాజు కూడా ఒకరు. ఇక కార్తీక్ సుబ్బరాజు సూర్య , పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా సూర్య 44వ సినిమాని తీస్తున్నాడు.


లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి BIGTV Whats APP Channelని ఫాలో అవ్వండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి 👇

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

Related News

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Big Stories

×