EPAPER

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Karthik Subbaraj : తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టాడు. అదే తను దర్శకుడుగా మాత్రం జిగర్తాండ సినిమాతో పరిచయం అవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఎక్కువ బడ్జెట్ కారణంగా మొదట ఆ సినిమాని తెరకెక్కించలేకపోయాడు. చాలా లో బడ్జెట్లో పిజ్జా అనే సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్.


పిజ్జా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో కొద్దిపాటి సంచలనాన్ని సృష్టించింది. కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వచ్చిన జిగిర్తండా సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమాతో మణిరత్నం శంకర్ లాంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలను కూడా పొందుకున్నాడు.ఇదే సినిమాను గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్.ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియనిది కాదు. వరుణ్ తేజ్ లోని ఒక సరికొత్త నటుడును బయటకు తీసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇకపోతే ఇదే ఒరిజినల్ సినిమాకు నటుడు బాబి సింహకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చేసే ప్రతి సినిమా గురించి కూడా ప్రేక్షకులు వెయిట్ చేయడం మొదలుపెట్టారు.

జిగర్తాండ సినిమా తర్వాత ఇరైవి, మెర్క్యూరీ అంటే సినిమాలను తెరకెక్కించాడు కార్తీక్. అయితే కార్తీక్ కు రజనీకాంత్ సినిమా చేసే అవకాశం లభించింది. రజనీకాంత్ హీరోగా రిలీజ్ అయిన పేట సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు తాను స్వతహాగా ఒక అభిమాని కాబట్టి రజనీకాంత్ ను అలా చూపించి సూపర్ హిట్ సినిమాను రజనీకాంత్ ఖాతాలో వేశాడు.ఆ తర్వాత కొన్ని సినిమాలను చేశాడు కార్తీక్. వీటిలో జగమే తంత్రం మహాన్ వంటి సినిమాలు మంచి రెస్పాన్స్ సాధించాయి.మహాన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. చియాన్ విక్రమ్, ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి ఆదరణను సాధించుకుంది.


ఇప్పటివరకు తన కెరియర్ లో ఒక్కటి కూడా ప్రాపర్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు కార్తీక్ సుబ్బరాజు. ఇక ప్రస్తుతం సూర్య చేస్తున్న 44వ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఇది కూడా గ్యాంగ్ స్టార్ సినిమా అనుకున్నారు. అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ సినిమాని చెబుతూ వచ్చాడు. తన లైఫ్ లో ఫస్ట్ టైం పూజ హెగ్డే సూర్య లాంటి స్టార్ కాస్ట్ తో లవ్ స్టోరీ చేస్తున్నందుకు తాను కూడా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజు.

Related News

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Big Stories

×