EPAPER

YouTube Account Recovery : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

YouTube Account Recovery : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

YouTube Account Recovery : సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ యూట్యూబ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​ ఫామ్​ యూట్యూబ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఫ్రీగా అందుబాటులో ఉండడంతో, రోజుకు లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కంటెంట్​ క్రియేటర్లకు ఇది ఎంతగానో చేరువైంది. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఓ చక్కని వేదిక అయింది. పైగా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా రూ. లక్షలు సంపాదిస్తున్న వారు చాలా మందే ఉన్నారు.


అయితే ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ ప్లాట్​ ఫామ్​ను సైబర్‌ నేరగాళ్లు ఆసరాగా చేసుకుని చేలరేగిపోతున్నారు. వీడియోలు క్రియేట్‌ చేసే వారి అకౌంట్​లను హ్యాక్‌ చేయడం, సదరు ఖాతాలోని సమాచారాన్ని తస్కరించడం చేస్తున్నారు. చాలా వరకు ప్రస్తుతం ఈ విషయం సర్వసాధారణం అయిపోయిందనే చెప్పాలి.

ALSO READ :శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్


దీంతో చాలా మంది యూట్యూబ్‌ కంటెంట్​ క్రియేటర్లు మరో దారి లేక మరో ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ సమస్యను గుర్తించిన గూగుల్‌ ఆ మధ్య ఏఐ సాయంతో ఓ పరిష్కారాన్ని తీసుకొచ్చింది. కొత్త టూల్​ను రూపొందించింది. హ్యాకింగ్​కు గురైన అకౌంట్​లను రికవర్‌ చేసుకునేందుకు, ఓ కొత్త టూల్‌ను రూపొందించింది గూగుల్​.

ముందుగా గూగుల్‌ అకౌంట్‌, యూట్యూబ్‌ ఛానెల్‌కు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తుంది. తర్వాత లాగిన్‌ను పునరుద్ధరిస్తుంది. అనంతరం హ్యాకర్‌ ఏమైనా మార్పులు చేసి ఉన్నా వాటిని గుర్తించి, తొలగించి అకౌంట్​ను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా చేస్తుంది.

ప్రస్తుతానికి ఈ టూల్‌ ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ టూల్‌ ఎవరికైనా అవసరం ఉండి అందుబాటులో లేకపోతే ఎక్స్‌లో యుట్యూబ్ ​ను (@TeamYouTube) సంప్రదించి సహాయం పొందొచ్చు. అయితే సంప్రదించే ముందు ప్రొఫైల్‌ పిక్చర్‌, యాడ్‌సెన్స్‌ అకౌంట్‌లో మార్పులు సహా అనధీకృత వీడియోల అప్‌లోడ్‌ వంటి మార్గాల ద్వారా మొదట ఖాతా హ్యాక్ అయిందో లేదో నిర్ధరించుకోవాలి. హ్యాక్ అయింది నిజమైతే యూట్యూబ్‌ హెల్ప్‌ సెంటర్ ద్వారా టూల్‌ను ఉపయోగించుకొని అకౌంట్‌ను రికవర్‌ చేసుకోవచ్చు. కాబట్టి మీ అకౌంట్​ హ్యాక్​ అయినట్టు అనిపిస్తే ఈ టూల్ ద్వారా సాల్వ్ చేసుకోండి.

ఇక యూట్యూబ్ సైతం తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికే యూట్యూబ్లో పలు విషయాలు సులభతరం చేసిన ఆ సంస్థ… తాజాగా మూడు నిమిషాలు నిడివి తో షార్ట్స్ ను సైతం అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న యాప్ గా నిలుస్తూ వస్తున్న యూట్యూబ్.. ఏ అవసరానికి అయినా అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ యాప్ కు హ్యాకర్స్ భయం కూడా అంతే ఎక్కువగా కనిపిస్తుంది

కాగా, ఈ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. రీసెంట్​గా స్లీప్‌ టైమర్‌, రీసైజబుల్‌ మినీ ప్లేయర్‌, ఫేవరెట్‌ ప్లే లిస్ట్ ఇలా పలు ఫీచర్లను పరిచయం చేసింది. మీ యూట్యూబ్​ యూజర్స్ అయితే వీటిని ఎంచక్కా ఉపయోగించుకోండి.

Related News

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

BSNL fibre plan : అదిరే ఆఫర్ గురూ.. సింగిల్ రీఛార్జ్ తో 6500GB… BSNL ప్లాన్ అదిరిపోలా!

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Big Stories

×