EPAPER

Sid Sriram: ఒక్క రోజు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. ఈ డిమాండ్ మాములుగా లేదుగా..?

Sid Sriram: ఒక్క రోజు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్.. ఈ డిమాండ్ మాములుగా లేదుగా..?

Sid Sriram.. టాలెంట్ ఉండాలి కానీ భాషతో సంబంధం లేదు అని నిరూపిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్.. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) కూడా ఒకరు. ఈయన తెలుగువాడు కాకపోయినా ఎక్కువగా తెలుగులోనే సూపర్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా ఈయన పాటకు పరవశించని వారు లేరేమో.. మెలోడీ సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పించే ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో హవా చూపిస్తున్నారు. నిజానికి ఏ పాట విన్నా శ్రీరామ్ వాయిస్సే మనకు వినిపిస్తుంది.. మహేష్ బాబు (Maheshbabu ), పరశురాం (Parushuram ) కాంబినేషన్లో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాట పాడింది కూడా శ్రీరామ్.


గాత్రంతోనే శ్రోతలను మెప్పిస్తూ..

ఆయన గొంతులో ఏదో తెలియని తీయదనం ఉంటుంది. ఆయన పాట వింటే అలా కనెక్ట్ అయిపోతారు. పాట ఏదైనా ఆయన పాడితే అది కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.ముఖ్యంగా ఆయన పాడారు అంటే ఆ సినిమా ఫ్లాపైన ఆయన పాడిన పాటలు మాత్రం సూపర్ హిట్గా నిలుస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రస్తుతం అటు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగారు.


ఒక్కో పాటకు రూ.8 లక్షల వరకు రెమ్యూనరేషన్..

డియర్ కామ్రేడ్ సినిమాతో తెలుగు సినీ పాటల ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈయన దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ సింగర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయనకు డిమాండ్ ఎంతలా ఉందంటే ఒక పాటకు సుమారుగా రూ . 6లక్షల నుంచీ రూ.8 లక్షల వరకు పారితోషకం తీసుకుంటాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పిస్తాడు కాబట్టే ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా టాప్ సింగర్స్ కూడా ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోరు అనడంలో సందేహం లేదు. నిజానికి ఆయన పాటలకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి శ్రీరామ్ ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

దక్షిణాదిలో టాప్ సెలబ్రిటీగా గుర్తింపు..

ముఖ్యంగా మాటే వినదుగా పాట మొదలుకొని ఇటీవల వచ్చిన కళావతి పాట వరకు ఈయన పాడిన అన్ని పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి..ముఖ్యంగా కళావతి పాట గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ పాట. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో ” మాటే వినదుగా ” పాట మొదలుకొని.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురం లో సినిమాలో సామజ వరగమన పాట వరకు అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటించిన ” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?” సినిమాలోని “నీలి నీలి ఆకాశం ” సింగర్ సునీతతో కలిసి చాలా అద్భుతంగా పాడారు. అలాగే పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో నటించిన వకీల్ సాబ్ లో “మగువా మగువా” పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. రంగ్ దేలో నా కనులు ఎప్పుడు, అలాగే పుష్పలో పాడిన శ్రీవల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన ఖాతాలో సూపర్ హిట్ సాంగ్స్ లిస్టు ఎక్కువే. అద్భుతమైన గాత్రంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ అదే రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ బిజీగా మారిపోయారు సిద్ శ్రీరామ్.

Related News

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Big Stories

×