EPAPER

Konda Surekha Defamation Case : నాంపల్లి కోర్టుకు రాలేనన్న కేటీఆర్, ఈనెల 23కు కేసు వాయిదా వేసిన న్యాయస్థానం

Konda Surekha Defamation Case : నాంపల్లి కోర్టుకు రాలేనన్న కేటీఆర్, ఈనెల 23కు కేసు వాయిదా వేసిన న్యాయస్థానం

KTR Defamation Case On Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం కేసు బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు వ్యక్తిగత కారణాలతో కేటీఆర్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో నాంపల్లి కోర్టు ఈనెల 23కు కేసును వాయిదా వేసింది. సినీ పరిశ్రమలోని పలువురి పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ, తనపై తీవ్ర ఆరోపణలు చేశారని, ఫలితంగా తన పరువుకు భంగం కలిగించారని కేటీఆర్​ దావా ఫైల్ చేశారు.


ఇవాళ నేను రాలేను…

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ కోర్టుకు ఇవాళ వాగ్మూలం ఇవ్వాల్సి ఉంది. తాను వ్యక్తిగత కారణాలతో ఈరోజు రాలేకపోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు కేటీఆర్ తరఫున న్యాయవాదులను నిలదీసింది.


రమ్మంటే మళ్లీ సమయం అడుగుతారే…

వాంగ్మూలం నమోదు చేస్తామని, అందుకు కోసం ఇవాళ రావాలని చెప్పినా రాకుండా, మళ్లీ సమయం ఎలా అడుగుతారని ప్రశ్నించింది. తమకు సోమవారం లేదా బుధవారం హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరగా, విచారణను ఈనెల 23 బుధవారం రోజుకు వాయిదా పడింది. ఆరోజే కేటీఆర్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

14న విచారణ, 18కి వాయిదా…

కేటీఆర్‌, మంత్రి కొండా సురేఖపై ఈనెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు వేశారు.  న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు, కేటీఆర్ తరఫున పిటిషన్​ దాఖలు చేశారు. దీంతో ఈనెల 14న విచారించిన న్యాయస్థానం ఈనెల‌ 18కి కేసు విచారణను వాయిదా వేసింది. ఇదే రోజున కేటీఆర్ తో పాటు సాక్షులందరి వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు వెల్లడించింది.

also read : ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే.. బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ చేస్తున్నారు.. కేటీఆర్

Related News

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Minister Konda Sureka : యాదగిరిగుట్ట లడ్డూ సూపర్… భక్తులకు, ఆలయాలను మరింత చేరువ చేస్తామన్న మంత్రి సురేఖ

Lady Aghori: కారుపై పుర్రెబొమ్మలు.. డేంజర్ అంటూ సింబల్.. తీరా చూసి అందరూ షాక్.. ఎక్కడ జరిగిందంటే?

Adani group donation: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ.. తెలంగాణకు భారీ విరాళం.. కారణం ఇదే!

Big Stories

×